Homeజాతీయ వార్తలుRahul Gandhi- CM Jagan: యూరప్‌లో రాహుల్‌ గాంధీ.. లండన్‌లో జగన్‌.. ఎందుకీ చర్చ?

Rahul Gandhi- CM Jagan: యూరప్‌లో రాహుల్‌ గాంధీ.. లండన్‌లో జగన్‌.. ఎందుకీ చర్చ?

Rahul Gandhi- CM Jagan: దేశంలో జీ-20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ యూరప్‌ వెళ్లారు. అక్కడికి ఎందుకోసం వెళ్లారో కాంగ్రెస్‌ వర్గాలు చెప్పడం లేదు. కనీసం సోషల్‌ మీడియాలో కూడా ఫొటోలు షేర్‌ చేయడం లేదు. జీ-20 సదస్సు జరుగుతున్న క్రమంలో ఆయన యూరప్‌ అకస్మాత్తుగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి లండన్‌ వెళ్లారు. ఆయన మీద కేసులు ఉండటంతో సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని ఆయన లండన్‌ కుటుంబసమేతంగా వెళ్లారు. అక్కడ ఆయన కూతుర్లు చదువుతున్న విషయం తెలిసిందే.

జగన్‌మోహన్‌రెడ్డి పదిరోజుల పాటు లండన్‌లో పర్యటిస్తారని సమాచారం. అయితే యూరప్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీని జగన్‌ కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. అత్యంత రహస్యంగా సాగుతున్న పర్యటనలో రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారనే అభిప్రాయం జాతీయ మీడియా వ్యక్తం చేయడం విశేషం. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తామని ఆయన ఇప్పటికే కొంతమంది ద్వారా రాయబారం పంపారనే వాదనలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా యూరప్‌లో రాహుల్‌గాంధీని ప్రత్యక్షంగా కలిసారని, పొత్తుల అంశంపై చర్చలు జరిపారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల విలీనం ఆపేందుకు ఆమె కాంగ్రెస్‌లో చేరితే తనకు నష్టమని జగన్‌ భాస్తున్నారు. అందుకే ఆమె విలీనం ఆపాలని.. తర్వాత వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తానని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఏపీలో.. జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని వైసీపీ నాయకులు, ఇతర నేతలు ఖండించలేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ మీద వైసీపీ నాయకులు దారుణమైన భాష ఉపయోగించేవారు. విజయసాయిరెడ్డి వంటి వారు ఎన్నోసార్లు రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేశారు. కొంతకాలం నుంచి వారంతా సైలెంట్‌ అయ్యారు.
దీంతో జగన్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version