
విదేశీ ఏజెన్సీలకు పనిచేసే ముగ్గురు ఫొటోగ్రాఫర్లను కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అభినందించి విమర్శలను ఎదుర్కొంటున్నారు. డార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్ని ఆనంద్ అనే ముగ్గురు ఫొటోగ్రాఫర్లకు పులిట్జర్ అవార్డ్ దక్కిన సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ ఒక ట్వీట్ చేశారు.
ఎందుకని విమర్శలు?
జమ్మూకశ్మీర్ లో 370 అధికరణం ఎత్తివేశాక ఈ ఫొటోగ్రాఫర్లు భారతదేశాన్ని కించపరిచేలా ఫొటోలు తీసి ప్రచురించారని బీజేపీ ఆరోపిస్తోంది. జమ్మూకశ్మీర్ లో ప్రజలు భారత సైన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అర్ధం వచ్చేలా ఫొటోలను తీసి ప్రచురించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. కశ్మీర్ భారత్ లో భాగం కాదనే వారిని రాహుల్ అభినందించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాధానం చెప్పాలని సంబిత్ డిమాండ్ చేశారు.