https://oktelugu.com/

Raghurama: రాజీనామాకు రఘురామ సిద్ధం..మళ్లీ గెలవడం కల్ల?

Raghurama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గెలిచిన తరువాత ఆరు నెలల నుంచి వైసీపీని ఇరుకున పెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. కానీ వైసీపీ కోరిక తీరడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభ వేదికగా రఘురామపై నిరంతరం అనర్హత వేటు వేయించాలని ప్రయత్నాలు చేసినా ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రఘురామ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రఘురామ తీరుతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2022 4:01 pm
    Follow us on

    Raghurama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గెలిచిన తరువాత ఆరు నెలల నుంచి వైసీపీని ఇరుకున పెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. కానీ వైసీపీ కోరిక తీరడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభ వేదికగా రఘురామపై నిరంతరం అనర్హత వేటు వేయించాలని ప్రయత్నాలు చేసినా ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రఘురామ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రఘురామ తీరుతో వైసీపీ ఆందోళన చేస్తోంది.

    Raghurama

    Raghurama

    ఎంపీపై అనర్హత వేటు వేయించాలని అన్ని ప్రయత్నాలు చేసింది. స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో రఘురామ వైసీపీ కోసం పనిచేయకుండా ప్రతిపక్షాల కోసం శ్రమిస్తున్నారనే విషయం తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. గెలిచినప్పటి నుంచి కూడా వైసీపీకి ఎదురుదెబ్బలే తప్ప ప్రయోజనాలు మాత్రం కనిపించలేదు.

    Also Read: పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకుండా చంద్రబాబు గెలవగలడా?

    వైసీపీపై విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిళ్లు రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి మరోమారు తన అక్కసు వెళ్లగక్కారు. అయినా అధికార పార్టీ ప్రయత్నాలు పని చేయలేదు. దీంతో ఆయన వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పార్టీని ఎండగడుతూ నిందిస్తున్నారు.

    రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోసారి నరసాపురం నుంచి పోటీ చేసి అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారో తెలియడం లేదు. అయితే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. రఘురామ మాత్రం మళ్లీ గెలుస్తారో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఎందుకంటే ఈయన వైసీపీ గాలిలో గెలిచాడు. నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు చేరువ కాలేదు. పైగా అధికార వైసీపీనే ఎదురించి ప్రజల్లోనూ ఒకరకమైన ఇమేజ్ ను తెచ్చుకున్నారు. రఘురామ పోటీచేసినా గెలవడం కష్టమేనంటున్నారు. దీంతో రఘురామ తీసుకున్న నిర్ణయంపై అందరిలో సంశయాలు నెలకొన్నాయి. గెలుపు కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా విజయం సాధిస్తారా? అన్న అనుమానాలున్నాయి.

    Also Read: ఆ నాలుగు మీడియా సంస్థలపై జగన్ నిషేధం.. కేసీఆర్ బాటలోనే సంచలనం

    Tags