RGV on YS Jagan: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మొన్నటివరకు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ మంత్రులను టార్గెట్ చేశాడు. సీఎం జగన్ అంటే అభిమానం అంటూనే పాలన బాలేదని కితాబిచ్చాడు.
తన పదునైన ప్రశ్నలతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. గత వారం రోజులుగా సినిమా ఇండస్ట్రీగా మద్దతుగా, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్మ హాట్ కామెంట్స్ చేస్తూనే వచ్చాడు. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌కు జాగ్రత్తలు చెప్పాడు. నీ చుట్టూ ఉన్న వారితో కేర్ ఫుల్‌గా ఉండాలని ట్విట్టర్ వేదికగా సూచనలు చేశాడు.
టికెట్ ధరల విషయంలో ఏపీ మంత్రులు అనిల్ కుమార్, పేర్నినాని, కొడాలి నానిలను వరుసగా టార్గెట్ చేసిన వర్మ అటు సోషల్ మీడియాతో పాటు ఇటు మీడియా డిబెట్స్ లోనూ ఓ ఆటాడుకున్నాడు. పేర్నినాని పదికి పైగా సూటి ప్రశ్నలు సంధించాడు. సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వం జోక్యం ఎందుకు చేసుకుంటుందని ప్రశ్నించి అందరినీ షాక్ కు గురిచేశాడు. అసలు కొడాలి నాని అంటే ఎవరో తనకు తెలీదని బాంబ్ పేల్చాడు. ఏపీ ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనినే ఏపీ ప్రభుత్వం చేస్తుందని కుండబద్దలు కొట్టింది. ఇక చివరగా కూర్చుని మాట్లాడుకుంటే అంతా సెట్ అవుతుందని మంత్రులు, సినీ పెద్దలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
Also Read: రాజీనామాకు రఘురామ సిద్ధం..మళ్లీ గెలవడం కల్ల?
ఈ క్రమంలోనే వర్మ మరోసారి రంగంలోకి దిగాడు. ఉన్నట్టుండి ఇంకో బాంబ్ పేల్చాడు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఒక్కరినే తను నమ్ముతానని, చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. వారివారి పర్సనల్ అజెండాల కోసం ముఖ్యమంత్రి జగన్ ను విలన్‌ను చేస్తున్నారని ఆరోపించారు. ‘హే జగన్… నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్ తో జాగ్రత్తగా ఉండు’ అంటూ ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రిని హెచ్చరించారు రామ్ గోపాల్ వర్మ.. నిజంగానే జగన్ చుట్టున్న వారంతా ఆయన్ను తప్పు దారి పట్టిస్తున్నారా? అనే తేలాల్సి ఉంది. కాగా, వర్మ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్జీవి… వాళ్ళు చేయలేనిది నువ్వు చేశావంటూ ?