https://oktelugu.com/

ఫ్యామిలీలో అందరి కళ్లూ నా మీదే పడ్డాయి: సాయి ధరమ్‌

‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’తో వరుసగా రెండు హిట్స్‌ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ జోరు మీదున్నాడు. 2016లో వచ్చిన ‘సుప్రీమ్‌’ తర్వాత చేసిన ఆరు సినిమాలూ ఫ్లామ్‌ కావడంతో డీలా పడ్డ సాయి కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ మూవీని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. నభా నటేశ్‌ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన టీజర్తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 10:08 pm
    Follow us on

    Sai Dharm Tej

    ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’తో వరుసగా రెండు హిట్స్‌ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ జోరు మీదున్నాడు. 2016లో వచ్చిన ‘సుప్రీమ్‌’ తర్వాత చేసిన ఆరు సినిమాలూ ఫ్లామ్‌ కావడంతో డీలా పడ్డ సాయి కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ మూవీని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. నభా నటేశ్‌ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన టీజర్తో పాటు ‘నో పెళ్లి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ సూపర్హిట్‌ అయింది. సినిమాపై అంచనాలను పెంచింది. షెడ్యూల్‌ ప్రకారం మే 1 తేదీనే మూవీ రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌పై తేజు భారీ అంచనాలే పెట్టుకున్నాడు. పెళ్లి వద్దు… సింగిల్‌ లైఫే బెటర్ అని హితబోధ చేసే హీరో… ప్రేమలో పడే బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తెరకెక్కింది. అయితే రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా సాయి ధరమ్‌ సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు. కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అతనికి ఓ తోడు వెతకాలని చూస్తున్నారట.

    Also Read: సూటు..బూటులో వస్తున్న బిచ్చగాడు 2

    ‘బ్యాచిలర్ లైఫే బెస్ట్‌ అన్నది నా నమ్మకం. కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అది కుదరదు అంటున్నారు. మా కజిన్స్‌ అందరూ ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటున్నారు, దాంతో, మా ఫ్యామిలీలో అందరి కళ్లూ ఇప్పుడు నా మీదే ఉన్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్న ఈ సింగిల్‌ లైఫ్ ఎప్పుడు ముగుస్తుందో నాకైతే తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో సాయి పేర్కొన్నాడు. మెగా ఫ్యామిలీలో సాయి కంటే వయసులో పెద్దోళ్లయిన అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కూడా రీసెంట్‌గా సెటిలైంది. దాంతో మిగిలింది సాయి తేజ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌ మాత్రమే. సాయి, శిరీష్‌ ఇద్దరి వయసు 33 ఏళ్లు కాగా… వరుణ్‌ రీసెంట్‌గా 30లోకి అడుగు పెట్టాడు. వెనకాల తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఉండడంతో పెళ్లి చేసుకొమ్మని సాయి తేజ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరి, తన బ్యాచిలర్లైఫ్‌ను అతను ఎప్పుడు ముగిస్తాడో చూడాలి.