https://oktelugu.com/

 కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్

నేడు(సెప్టెంబర్ 21) హీరోయిన్ కృతిశెట్టి పుట్టిన రోజు. కృతిశెట్టి తెలుగులో ‘ఉప్పెన’ మూవీలో నటిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ‘ఉప్పెన’తో మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెల్సిందే. కృతిశెట్టి సైతం ‘ఉప్పెన’ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఈ మూవీ షూటింగు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కరోనా లేకుంటే ఇప్పటికే థియేటర్లలో సినిమా సందడి చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 / 09:10 PM IST
    Follow us on

    నేడు(సెప్టెంబర్ 21) హీరోయిన్ కృతిశెట్టి పుట్టిన రోజు. కృతిశెట్టి తెలుగులో ‘ఉప్పెన’ మూవీలో నటిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ‘ఉప్పెన’తో మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెల్సిందే. కృతిశెట్టి సైతం ‘ఉప్పెన’ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.
    ఈ మూవీ షూటింగు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కరోనా లేకుంటే ఇప్పటికే థియేటర్లలో సినిమా సందడి చేసి ఉండేది. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    నేడు కృతిశెట్టి పుట్టిన రోజును సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చింది. కృతిశెట్టి క్యూట్ ఫొటోను ట్వీటర్లో రిలీజ్ చేసి ‘క్యూటెస్ట్ అండ్ నేచుర‌ల్ యాక్ట్రెస్ కృతిశెట్టికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు’ అంటూ చిత్రయూనిట్ విషెస్ చెప్పింది. ఈ పోస్ట‌ర్‌లో కృతిశెట్టి చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటూ అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా ఆకట్టుకుంటోంది.

    ‘ఉప్పెన’ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలను సమకూర్చాడు. ఇప్పటికే ఈ మూవీలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్టుగా నిలిచాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్టు లుక్ ఎంతోగానో ఆకట్టుకున్నాయి. వైష్ణవ్, కృతిశెట్టి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరినట్లు కన్పిస్తోంది. ఈ మూవీలో తమిళనటుడు విజయ్ సేతుపతి ఓ కీల్ రోల్ చేస్తున్నాడు.

    ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ‘ఉప్పెన’ చిత్రం ముందుగానే వస్తుందనే టాక్ విన్పిస్తోంది. అయితే కలెక్షన్లు ఉప్పెనలా వస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!