https://oktelugu.com/

టైలర్ టాక్ : సమస్యలతో నవ్విస్తోన్న ‘ముగ్గురు మొనగాళ్లు’ !

కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నిలబడటానికి ఆస్తులు పన్నంగా పెట్టి మరీ మరో సినిమాకి బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ధిక సాయం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘ముగ్గురు మొనగాళ్లు’. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ట్రైలర్ అయితే ఆస‌క్తిక‌రంగానే ఉంది. స్టోరీ సెటప్, అండ్ క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ చేశారు. ఇక ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబబ్బ నవ్విస్తాననే నమ్మకాన్ని కలిగిస్తూ ఈ ట్రైలర్ ఫన్నీగా సాగింది. ముఖ్యంగా వినికిడి […]

Written By:
  • admin
  • , Updated On : May 25, 2021 / 12:55 PM IST
    Follow us on

    కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నిలబడటానికి ఆస్తులు పన్నంగా పెట్టి మరీ మరో సినిమాకి బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ధిక సాయం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘ముగ్గురు మొనగాళ్లు’. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ట్రైలర్ అయితే ఆస‌క్తిక‌రంగానే ఉంది. స్టోరీ సెటప్, అండ్ క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ చేశారు. ఇక ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబబ్బ నవ్విస్తాననే నమ్మకాన్ని కలిగిస్తూ ఈ ట్రైలర్ ఫన్నీగా సాగింది.

    ముఖ్యంగా వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనలు, ఆలాగే ఆ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ లోని కంటెంట్ ని బట్టి అర్ధమవుతుంది. పైగా ట్రైలర్ లోని షాట్ మేకింగ్, అండ్ మ్యూజిక్ కూడా సినిమా స్థాయిని పెంచాయి.

    మొత్తమ్మీద బాక్సాపీస్ వద్ద అడ్రెస్ లేని ఈ సినిమాకి, మినిమమ్ ప్లాట్ ఫామ్ ను ఖాయం చేసింది ఈ ట్రైలర్. ట్రైలర్ కి తగ్గట్టు సినిమా కూడా బాగుంటే.. కమెడియన్ కే పరిమితం కాకుండా ఇక హీరోగా కూడా శ్రీనివాస్ రెడ్డి పరిణితి చెందొచ్చు. అన్నట్టు ఈ సినిమాలోని మిగిలిన విషయాల గురించి ముచ్చటించుకుంటే.. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

    ఈ మూవీలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా చేస్తుండగా, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ గా రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు
    తెలుస్తోంది.