రఘురామ ఏ1, ఆ రెండు చానెల్స్ ఏ2, ఏ3

ఎంపీ రఘురామకు ఏపీ సర్కార్ ఉచ్చు బిగిసింది. ఇక సదురు రెండు న్యూస్ చానెల్స్ సైతం ఇందులో కుట్రదారులుగా సీఐడీ చేర్చింది. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ ను ఏపీ సీఐడీ విడుదల చేసింది. రఘురామకృష్ణం రాజును సీఐడీ పోలీసులు సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రాజును ప్రశ్నించారు. ఏపీలోని కులాల మధ్య విధ్వేషం సృష్టించే విధింగా ఎందుకు మాట్లాడారు? ఆయన వెనుక ఎవరున్నారనే […]

Written By: NARESH, Updated On : May 15, 2021 3:34 pm
Follow us on

ఎంపీ రఘురామకు ఏపీ సర్కార్ ఉచ్చు బిగిసింది. ఇక సదురు రెండు న్యూస్ చానెల్స్ సైతం ఇందులో కుట్రదారులుగా సీఐడీ చేర్చింది. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ ను ఏపీ సీఐడీ విడుదల చేసింది. రఘురామకృష్ణం రాజును సీఐడీ పోలీసులు సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రాజును ప్రశ్నించారు. ఏపీలోని కులాల మధ్య విధ్వేషం సృష్టించే విధింగా ఎందుకు మాట్లాడారు? ఆయన వెనుక ఎవరున్నారనే కోణంలో సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు బయటపెట్టారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటిలో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు గుంటూరులోని ఏపీ సీఐడీ ఆఫీసులో నిన్న రాత్రి వరకు ప్రశ్నించారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను తాజాగా బయటపెట్టారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు రెండు న్యూస్ చానెల్స్, సోషల్ మీడియా ద్వారా ఏపీలోని కొన్ని రెడ్డి, క్రిస్టియన్ల కులాలు, ఇతర సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా ఎంపీ రఘురామ రెండు న్యూస్ చానెల్స్ తో కలిసి కుట్ర చేశాడని.. దారుణంగా అవమానించేలా మాట్లాడాడని అందులో పేర్కొన్నారు.

ఈ ఎఫ్ఐఆర్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు రెండు న్యూస్ చానెల్స్ ను కూడా నిందితులుగా సీఐడీ అధికారులు చేర్చారు. ఏ2గా , ఏ3గా రఘురామకృష్ణంరాజు తరుచుగా మాట్లాడే టీడీపీ అనుకూల చానెల్స్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆ రెండు టీవీ న్యూస్ చానెళ్లతో కలిసి ఎంపీ రఘురామ కుట్ర చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పేర్కొంది. రఘురామకృష్ణం రాజు ఆ రెండు టీవీ న్యూస్ చానెళ్లు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించి కుట్ర చేశాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ ఆరోపించింది.

ఎంపీ రఘురామ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటీషన్ మీద ఈరోజు కోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఎంపీని రిమాండ్ కు తరలించ్చవద్దని సీఐడీని ఆదేశించింది.