2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎంగా పదవీ చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం జగన్ ప్రజల్లోకి దూసుకెళుతోన్నారు. మరోవైపు ప్రత్యర్థులకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. అయితే జగన్ ప్రభంజనంలోనూ స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు వ్యవహార శైలిలో ఆపార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సదరు ఎంపీ విషయంలో సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీచేసి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. నాటి నుంచి ఆయన బీజేపీకి రకరకాల దగ్గరవుతూ సొంతపార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆపార్టీ ఎంపీలంతా ఇటీవల లోక్ సభ స్పీకర్ ను కలిసి అతడిపై అనర్హత వేటు వేయాలని కోరారు.
వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసిన తర్వాత రఘురామ కృష్ణంరాజు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను, కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళుతారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి సీఎం జగన్ కు ఇరుకున పెట్టేలా రఘురామరాజు వ్యహరిస్తున్నారు. తాజాగా నర్సాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది.
Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?
నర్సాపురం అసెంబ్లీ పరిధిలో 4కోట్లతో నిర్మించనున్న భవనాలను ప్రారంభించాలని నిర్మలా సీతారామన్ కు ఆహ్వానం పలికారు. అలాగే అక్టోబరులో ఒకరోజు తన నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. అలాగే సముద్రతీరంలో కోతకు గురవుతున్న రివిట్మెంట్ పనుల కోసం రూ.200కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని రఘురామ కృష్ణంరాజు విన్నించారు. నిర్మల సీతారామన్ గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో నర్సాపురం నియోజకవర్గంలోని మైనపువానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
అయితే ఎంపీ రఘురామరాజు తనపై వైసీపీ సస్పెన్షన్ వేటువేసేలా ఇలా వ్యవహరిస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. అయితే సదరు ఎంపీ తీరును ముందే గ్రహించిన జగన్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇలా ఎంతకాలం రఘురామ కృష్ణంరాజు విషయంలో సీఎం జగన్ సహనంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే..!