Homeజాతీయ వార్తలుRafale fighter jets: రఫేల్‌కు మరింత పదును.. కొత్త టెక్నాలజీ అనుసంధానం!

Rafale fighter jets: రఫేల్‌కు మరింత పదును.. కొత్త టెక్నాలజీ అనుసంధానం!

Rafale fighter jets: భారత వైమానిక దళం ప్రస్తుతం భారీ మార్పులను చూస్తోంది. ఇప్పటి వరకు ఉన్న మిగ్, సుఖోయ్‌ యుద్ధ విమానాలకు కాలం చెల్లింది. దీంతో కొత్త ఆయుధాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై భారత్‌ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మిగ్, సుఖోయ్‌ స్థానంలో తేజస్‌లు వచ్చాయి. ఇక భారత్‌ ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. ప్రపంచంలో ఉన్న రఫేల్‌ విమానాల కన్నా.. మన వద్ద ఉన్నవి అత్యంత చురుకైనవి, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉన్నవి. తాజాగా వీటికి మరింత పదును పెట్టాలని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నిర్ణయించింది. దీంతో కేంద్రం రూ.1,500 కోట్లతో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఆధునిక వైమానిక ఆధిపత్యం..
ఫ్రాన్స్‌ తయారు చేసిన రఫేల్‌ జెట్ల కొనుగోలు భారత్‌ రక్షణ వ్యూహాన్ని పూర్తిగా మలిచింది. ఇతర దేశాలకన్నా భారత వెర్షన్‌ మరింత అధునాతనమైనదిగా రూపొందించబడింది. అత్యాధునిక అవియానిక్స్, బహుళ అనుకూల లక్ష్య సెన్సార్లు, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు రఫేల్‌ను ‘‘మల్టీ రోల్‌’’ ఫైటర్‌గా మలిచాయి. ఇది ఒకేసారి గగనతలం, భూ ఉపరితలం, సముద్ర లక్ష్యాలను సమర్థవంతంగా దాడి చేయగలదు. తాజాగా వీటికి అమర్చేలా భారత్‌ 1,500 కోట్ల రూపాయల వ్యయంతో యూరోపీయన్‌ తయారీ సంస్థలతో మెటియార్‌ క్షిపణుల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్షిపణులు 200 కిలోమీటర్లకు మించి ఉన్న శత్రు విమానాలను కచ్చితంగా ఛేదించగల శక్తి కలిగి ఉంటాయి. అధునాతన రాడార్‌ గైడెన్స్, ‘‘నో ఎస్కేప్‌ జోన్‌’’ సామర్థ్యంతో ఇవి రఫేల్‌ యుద్ధవిమానాలకు భారీ దెబ్బతీసే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.

స్వయం సమృద్ధికి తేజస్‌
భారత్‌ స్వయంగా రూపొందించిన తేజస్‌ జెట్‌ రాబోయే కాలంలో వైమానిక దళానికి పునరుత్పత్తి శక్తిని ఇస్తుంది. రఫేల్‌ వంటి విదేశీ ఆధునిక యంత్రాలతో పాటు తేజస్‌ చేరడం వల్ల దళం సమతుల స్థాయిలో ఆధిపత్యాన్ని సాధిస్తుంది. ఇది మేక్‌ ఇన్‌ ఇండియా ప్రయత్నాలకు నిదర్శనం. రఫేల్‌–మెటియార్‌ కలయిక భారత వైమానిక దళానికి గగనతల ఆధిపత్యం సాధించేందుకు కీలకం అవుతుంది. చైనా, పాకిస్తాన్‌పై వ్యూహాత్మక సమతౌల్యం నిలబెట్టడంలో ఈ శాస్త్రసమ్మత సమీకరణ నిర్ణాయక పాత్ర పోషిస్తుంది.

మిగ్‌ల వెనకబడిన యుగం ముగిసి, సుఖోయ్‌ దాడి శక్తితో, రఫేల్‌ ఆధునికతతో, తేజస్‌ స్వదేశీకరణతో భారత్‌ ఆకాశ వ్యూహం పటì ష్టమవుతోంది. ఈ మార్పు రక్షణ రంగంలో నూతన చరిత్రను రాస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version