Homeఆంధ్రప్రదేశ్‌ABN RK Kotha Paluku- YS Sharmila: జగన్ కు పోటీగా వైయస్ షర్మిల: కాంగ్రెస్...

ABN RK Kotha Paluku- YS Sharmila: జగన్ కు పోటీగా వైయస్ షర్మిల: కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపుతున్న ఏబీఎన్ రాధాకృష్ణ

ABN RK Kotha Paluku- YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో దిక్కు దివానం లేకుండా మారిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు రానున్నాయా? కర్ణాటక రాష్ట్రంలో గెలిచిన ఊపులో కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తోందా? ఇందులో భాగంగానే వైయస్ షర్మిల కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగి స్తోందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నాడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. ప్రతి ఆదివారం అతడు తన పేపర్లో కొత్త పలుకు శీర్షికన దేశం, తెలుగు రాష్ట్రాల్లో వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో, తనకు ఉన్న సమాచారం ప్రకారం ఎడిటోరియల్ రాస్తాడు. ఒక్కోసారి ఇది వర్క్ అవుట్ అవుతుంది..మరోసారి బూమారాంగ్ అవుతుంది. ఎవరు ఎలా అనుకున్నా రాధాకృష్ణ తన ధోరణి మార్చుకోడు. మార్చుకుంటే ఆయన రాధాకృష్ణ ఎలా అవుతాడు?

కాంగ్రెస్ లోకి షర్మిల

తాజాగా రాసిన తన కొత్త పలుకులో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందని రాధాకృష్ణ కుండ బద్దలు కొట్టాడు. అంతేకాదు తెలంగాణలో ఉన్న వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె సహకరిస్తుందని జోష్యం చెప్పారు. గతంలోనే ప్రియాంక గాంధీ ఆమెతో మాట్లాడిందని, ఇందుకు ఆమె కూడా ఒప్పుకుందని ఆర్కే రాసుకొచ్చాడు. పైగా ఆమెకు రాజ్యసభ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని వివరించాడు. పైగా డీకే శివకుమార్ తో షర్మిలకు సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అని ఆర్కే చెప్పుకొచ్చాడు. ” కర్ణాటక ఫలితాలు తర్వాత శివకుమార్ ను బెంగళూరులో షర్మిల కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అనే వార్తలు వచ్చాయి. వాటిని షర్మిల ఖండించలేదు. అలాంటి ఛాన్స్ లేదని చెప్పలేమని ఆమె సంకేతాలు ఇచ్చారు” అని వేమూరి రాధాకృష్ణ కుండబద్దలు కొట్టాడు.

నిర్వీర్యం అయిపోలేదు

ఇక ఇదే వ్యాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాలేదని ఆర్కే వివరించాడు. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో మంచి స్థానాలు సాధించిందని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయిందని బాధపడ్డాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం జగన్ పార్టీకి బదిలీ అయిందని చెప్పాడు.” కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తిరిగి రావాలి అంటే ఒక బలమైన నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వం షర్మిల ఇస్తుంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏదైనా జరిగేందుకు అవకాశం ఉందని చాలామంది నమ్ముతున్నారు” అని ఆర్కే స్పష్టం చేశాడు. నిజంగా ప్రియాంకకు, వైయస్ షర్మిలకు మధ్య చర్చలు జరిగాయో లేదో తెలియదు కానీ.. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి షర్మిల కాంగ్రెస్ రూపంలో ఏపీకి వస్తుందని ఆందోళనకు గురి చేసే ఉద్దేశమే రాధాకృష్ణ వ్యాసంలో కనిపిస్తోంది. దీని ద్వారా తన గురువు చంద్రబాబు నాయుడుకు లైన్ క్లియర్ చేయాలని రాధాకృష్ణ సంకల్పంలాగా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న జగన్ కు, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం ఉందని రాసుకొచ్చిన రాధాకృష్ణ.. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని ఊహాగానాలు వదులుతున్నారు. నిజానికి షర్మిల తెలంగాణలో సత్తా చాటుతుందా అనే నమ్మకాలు ఎవరికీ లేవు. పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తానని చెబుతోంది. కానీ ఇక్కడ ఆమెకు డిపాజిట్ వస్తే గొప్పే అనే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన పార్టీని విలనం చేస్తే వచ్చే ఫాయిదా ఏమిటో రాధాకృష్ణ స్పష్టం చేయలేదు. షర్మిల నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాబట్టి, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఎంతోకొంత ఉనికి చాటే అవకాశం ఉంది. అయితే రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు తాజాగా ఏమైనా ప్రతిపాదనలు జరిగితే ఈ ఎన్నికలకు ముందే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కర్ణాటక రాష్ట్రం రెడీగా ఉంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే కర్ణాటక విజయం ద్వారా చేతి పార్టీకి వైకుంఠం చూపిస్తున్నారు రాధాకృష్ణ..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular