Purvanchal Expressway: ఒకటి కాదు.. రెండు కాదు.. 14850 కోట్ల రూపాయిలు.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పై అవాజ్య ప్రేమతో జాతీయ నిధులు తీసుకొచ్చి మరీ మన కేంద్రంలోని మోడీ సర్కార్ ‘పూర్వాంచల్’కు ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించింది. కేంద్రంలోని బీజేపీని నిలబెట్టిన ఈ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతానికి అన్ని కోట్ల నిధులు కేటాయించడాన్ని బీజేపీ సమర్తించుకున్నా.. మిగతా పేద రాష్ట్రాలు మాత్రం మోడీ సర్కార్ సవతి ప్రేమపై ఆడిపోసుకున్నాయి.

ఏ రాష్ట్రానికి అంత వ్యయం చేయకున్నా కూడా తమకు అధికారం కట్టబెట్టిన యూపీ రాష్ట్రానికి మోడీ సర్కార్ పెద్ద పీట వేసింది. ఏకంగా కోట్లు కుమ్మరించి ఘనంగా ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించింది. ఏపీ, తెలంగాణ సహా ఎన్నో రాష్ట్రాలు తమకూ ఎక్స్ ప్రెస్ హైవేలు ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నా కానీ కనికరించని మోడీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ లో మాత్రం ఇంజినీరింగ్ అద్భుతం అంటూ ఏకంగా ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించింది. దీనిపై ఏకంగా యుద్ధ విమానాలను ల్యాండ్ అయ్యేలా నిర్మించామని గొప్పలకు పోయింది.
యూపీ రాజధాని లక్నోకు రాష్ట్రంలోని తూర్పున ఉన్న జిల్లాలైన మౌ, ఆజంఘర్, బారాబంకీ, ప్రయాగ్ రాజ్, వారణాసి నగరాలను కలిపే విధంగా దీన్ని నిర్మించారు. ఈ ఎక్స్ ప్రెస్ వే రాజకీయంగా బీజేపీకి మేలు చేసేది అయితే.. ప్రజావసరాల దృష్ట్యా లక్షలాది మందికి మేలు చేయబోతోంది. దీంతో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మోడీ ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు.
కానీ కట్ చేస్తే భారీ వర్షాలకు పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కృంగిపోయింది. ప్రధాని రహదారిపై 15 అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతున్న కారు అందులో పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. లక్నో నుంచి ఘాజీపూర్ ను అనుసంధానించే ‘ఎక్స్ ప్రెస్ వే’ను 2021 నవంబర్ లో ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే.. ఒక్క వర్షానికే కుంగిందని కాంగ్రెస్ విమర్శించింది.

ఇక అప్పట్లోనే కురిసిన వర్షాలకు బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవే కొట్టుకుపోయింది. వరద నీరు పొంగి జాతీయ రహదారిని ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయేలా చేసింది. రోడ్డు మధ్యలో మొత్తం కట్ అయిపోయి పెద్ద గుంత ఏర్పడింది. మోడీ ప్రారంభించిన 5 రోజులకే జాతీయ ఎక్స్ ప్రెస్ హైవే కొట్టుకుపోయిందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు షేర్లు చేస్తూ మోడీ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. ప్రచారం కోసం మోడీ ప్రారంభించారని.. వర్షాలు మోడీ సర్కార్ పనితనాన్ని బట్టబయలు చేశాయని సమాజ్ వాది పార్టీ మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే వద్ద కూడా కృంగి ఏకంగా ప్రయాణికులికి గాయాలు కావడంతో మోడీ సర్కార్ రోడ్ల నాణ్యతను అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. నిధులు దోచిపెట్టడమేనా? నాణ్యత ఉండక్కర్లా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.