spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ సంపాదన లెక్క తెలుసా?

CM Jagan: జగన్ సంపాదన లెక్క తెలుసా?

CM Jagan: ఏపీ బీజేపీ జగన్ సర్కార్ పై మరో పోరాటానికి సిద్ధమైంది. మద్యం అక్రమాలను వెలుగు తీసే పనిలో పడింది. మద్యంతో జగన్ సర్కార్ భారీగా సంపాదిస్తోందని.. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వేలకోట్ల రూపాయల కప్పం తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మున్ముందు బిజెపి జగన్ మద్యం అవినీతి పై దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రైవేటు మద్యం విక్రయాలను రద్దు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేలా కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. మద్యం ధరలను సైతం అమాంతం పెంచారు. మద్యం తాగేవారికి షాక్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే గతంలో వినిపించని, కనిపించని బ్రాండ్లను సైతం అమ్మకాలు ప్రారంభించారు. దీంతో అస్మదీయ కంపెనీల నుంచి కమీషన్ ఆశించి జగన్ నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం ఆరకం మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. వైసీపీ సర్కార్ ఆగడాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మద్యం అవినీతిని బయటపెడుతోంది.

2019లో టిడిపి అధికారం కోల్పోయినప్పుడు ఏపీ మద్యం ఆదాయం 19 వేల కోట్లు. ప్రస్తుతం నెలకు సగటున 32 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం అంత స్థాయిలో ఆదాయం చూపట్లేదు. సరిగ్గా ఈ పాయింట్ నే తీసుకొని ఇప్పుడు బిజెపి సర్కార్ పై పోరాటం ప్రారంభించింది. నెలకు 20 వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం పక్కదారి పడుతున్నట్లు తాజాగా పురందేశ్వరి ఆరోపించారు. వాటికి లెక్కలతో సహా గణాంకాలు చూపించి మరీ విమర్శలు చేశారు. జగన్ సర్కార్ కు ఇంతలా ఆదాయం వస్తుందా అన్న రీతిలో ఆమె చెప్పుకొచ్చారు. దీంతో మున్ముందు భారతీయ జనతా పార్టీ మద్యం అవకతవకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏపీ బీజేపీ చంద్రబాబు అరెస్ట్ ను తప్పు పట్టింది. బిజెపి మిత్రుడైన పవన్ నేరుగా టిడిపితో పొత్తును ప్రకటించారు. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ మద్యం అవినీతిని బిజెపి బయట పెట్టడం విశేషం. దీనిపై ఏపీ బీజేపీ కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ గాని బిజెపి సీరియస్ గా తీసుకుంటే జగన్ సర్కార్ బోను ఎక్కడం ఖాయం. అయితే కేంద్ర పెద్దలు దీనిని పట్టించుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Oktelugu Epaper
Exit mobile version