Homeజాతీయ వార్తలుKetan Agarwal Case: పూణే వ్యాపారి కేతన్ కేసు.. సియా, చేతన్ మరో దారుణం మెలుగులోకి

Ketan Agarwal Case: పూణే వ్యాపారి కేతన్ కేసు.. సియా, చేతన్ మరో దారుణం మెలుగులోకి

Ketan Agarwal Case: పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు వెలుగు చూశాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సంస్థల అధికారులు ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఈ నిజం బయటపడింది.

కేతన్ కేసులో దర్యాప్తు సంస్థల అధికారులు కొద్దిరోజులుగా విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేతన్, సియాకు మధ్య జరిగిన వ్యవహారం గురించి.. దర్యాప్తు సంస్థల అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన దర్యాప్తు సంస్థల అధికారులకు ఫ్యుజులు ఎగిరిపోయేలా చేసింది. అంతేకాదు ఇలా కూడా జరుగుతుందా అని వారు ఆశ్చర్యపోయేలా చేసింది.

కేతన్ తో సియా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత.. చేతన్ ఆమెతో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆమె అతడు వివాహం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో సియా కేతన్ అగర్వాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నవంబర్లో వీరిద్దరికి వివాహం జరగాల్సి ఉంది. ఉదయపూర్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన హోటల్లో వీరిద్దరికి వివాహం జరిపించడానికి బంధువులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కేతన్ తో వివాహం ఏమాత్రం ఇష్టం లేని సియా.. చేతన్ ను నాలుగు నెలల క్రితం పూణేలోని ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి సియా, చేతుల తరఫున ఇద్దరు స్నేహితులు హాజరైనట్టు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ సాగిస్తుండగా.. వారిద్దరి ఫోన్లలో వాట్సాప్ సంభాషణల ద్వారా ఈ విషయం బయటపడినట్టు తెలుస్తోంది.

రిజిస్ట్రార్ ఆఫీసులో వీరి వివాహం ఆమోదం పొందిందా.. ధ్రువీకరణ పత్రం జారీ చేశారా.. అనే దానిమీద పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో సియా షేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తొలగించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోలను రిట్రీవ్ చేయడానికి సాంకేతిక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా గత నెల 18న లోయలో పడి కేతన్ చనిపోయిన విషయం తెలిసిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version