Dhulipala Narendra : ఎన్నికలకు ఏడాది ముందే పని మొదలుపెట్టిన ధూళిపాళ్ళ.. విశేష ఆదరణ

Dhulipala Narendra : ఎన్నికలకు ఇంకా ఏడాది ముందే టీడీపీ నేత ధూళిపాళ్ల పని మొదలుపెట్టారు. నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వారి ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలన తీరును ఎండగడుతూ టీడీపీ పాలనలో ఏం చేసిందనేది ప్రజలకు వివరిస్తున్నారు. ధూళిపాళ్లకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. పోయిన ప్రతీచోట ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూలదండలు వేస్తూ కొనియాడుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే ఈసారి పొన్నూరులో ధూళిపాళ్లదే గెలుపు గ్యారెంటీ […]

Written By: NARESH, Updated On : February 25, 2023 9:38 am
Follow us on

Dhulipala Narendra : ఎన్నికలకు ఇంకా ఏడాది ముందే టీడీపీ నేత ధూళిపాళ్ల పని మొదలుపెట్టారు. నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వారి ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలన తీరును ఎండగడుతూ టీడీపీ పాలనలో ఏం చేసిందనేది ప్రజలకు వివరిస్తున్నారు. ధూళిపాళ్లకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. పోయిన ప్రతీచోట ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూలదండలు వేస్తూ కొనియాడుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే ఈసారి పొన్నూరులో ధూళిపాళ్లదే గెలుపు గ్యారెంటీ అన్న పవనాలు వీస్తున్నాయి.

“ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పొన్నూరు పట్టణంలోని ఐదో వార్డ్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేశారని  అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సుబ్బరాయ సత్రం ప్రాంతంలో అన్న క్యాంటీన్ నిర్మించామని, ఫలితంగా అంతకుముందు అసభ్యతకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం పరిశుభ్రంగా మారిందని తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో కడుపు నింపామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వివక్షతతో కూడిన రాజకీయాలు చేయడం ఫలితంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఆపేయడం జరిగిందని, అన్న క్యాంటీన్ మూసేయటం ద్వారా ఈ ప్రాంతం అశుభ్రతకు నిలయంగా మారిందని అన్నారు. ప్రతిదీ తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం తప్ప ప్రజలకు సహాయం చేయాలని దృక్పథం కానీ, చేసే పరిస్థితులు కానీ పాలకులలో కనిపించడం లేదని చెప్పారు. 25వ వార్డులో కోటిన్నర రూపాయలతో షాదీఖానా నిర్మాణం ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్దాంతరంగా ఆపేశారని తెలియజేశారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చదువుకోనే మైనారిటీ పిల్లలకు స్కాలర్ షిప్ ఇచ్చేవారని, ఇప్పుడవి రావడం లేదని అన్నారు. మైనారిటీలకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఖర్చు పెట్టడం లేదనీ, వారి పథకాలను ఆపివేశారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లే మైనారిటీలకు ఆర్థిక సాయం చేసే వారని, ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇచ్చే వారిని అలాంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వం ఆపివేయడం జరిగిందని అన్నారు. టిడిపి హాయాంలో కొన్ని కోట్ల రూపాయలు షాదీముబారక్ కింద ఇచ్చేవారని దానికి నేడు నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టించి లబ్ధిదారులకు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల గత మూడున్నర సంవత్సరాలలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆగిపోయాయనీ, అర్థంపర్ధం లేని నిబంధనలతో సామాన్యులను వేధిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి లేని విధ్యార్హతలు షాదీ ముబారక్ పథకానికి ఎందుకని నరేంద్ర కుమార్ నిలదీశారు. ఈ ప్రభుత్వం నిర్వాకం వల్ల కర్నూలు లాంటి కొన్ని ప్రాంతాలలో పోలీసులు వేధింపుల వల్ల కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అన్ని పథకాలలో కోత పెట్టడం జరిగిందని అన్నారు. టిడ్కో ద్వారా ఇళ్ళ నిర్మాణం చేపట్టి నాలుగైదు ఏళ్ళు అవుతున్నా, నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వేదింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు లబ్దిదారులకు వయసు ఎక్కువైందని వారికి ఇల్లు రావని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఆయా వర్గాల గురించి అనేక పథకాలు ప్రారంభించామని ప్రస్తుతం ఆ వర్గాల గురించి ఆలోచించే పరిస్థితి లేదని, ఆయా వర్గాల అభివృద్ధి గురించి పోరాటం చేస్తామని నరేంద్ర కుమార్ చెప్పారు.

ఈ కార్యక్రమములో పొన్నూరు పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు పఠాన్ అహ్మద్ ఖాన్, బండ్లమూడి బాబు రావు, నిడుబ్రోలు పార్టీ ప్రెసిడెంట్ జాగర్లమూడి సుధీర్, AMC మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వరరావు, పొన్నూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, SC అధ్యక్షులు ఎద్దు సోంబాబు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, మండల మహిళా అధ్యక్షురాలు బుడ్డా వెంకట శివమ్మ,రత్న కుమారి, మాజీ కౌన్సిలర్స్ పిన్నమనేని కోటేశ్వరరావు, అనిశెట్టి వీరబాబు, శిలార్ బాషా, మహమ్మద్ గౌస్, యరసాని శ్రీరామమూర్తి, తోట ప్రసాద్, మరియు వేజండ్ల హనుమంత రావు, నిమ్మగడ్డ ధర్మారావు, మున్నంగి సుబ్బారెడ్డి, గరిగంటి సాయిబాబు, వార్డు నాయకులు బాజీ సాహెబ్, బాజీ, హమీద్, జానీ, జానీ బేగ్, ఇస్మాయిల్, సంజు తదితరులు పాల్గొన్నారు…