Property Tax AP: ఆంధ్రప్రదేశ్ లో పన్నుల భారం ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ధరాభారం, మరోవైపు పెట్రో ధరలు, ఇంకో వైపు విద్యుత్ చార్జీల మోతలు పెరుగుతుంటే ప్రస్తుతం ఆస్తిపన్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిపక్షాలు మండిపడుతున్నా సర్కారు మాత్రం లెక్కచేయడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లోని ప్రజలపై దాదాపు రూ. 214 కోట్ల భారం పడుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో పన్నుల భారం 32 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో పన్నులు కట్టేందుకు జనం నానా తంటాలు పడుతున్నారు. ఆస్తి పన్ను కట్టకపోతే అధికారులు బెదిరింపులకు గురి చేయడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: Pragya Jaiswal: మద్యం తాగమని చెబుతూనే నీతులెందుకు?
ప్రస్తుతం పెంచిన ఆస్తిపన్నుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన రాక్షసపాలనలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఆర్థిక వ్యవస్థ కుదేలైన సందర్భంలో జగన్ ప్రజలపై భారం మోపేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆస్తి పన్ను పెంచుతూ జీవో తీసుకురావడం గమనార్హం.

ఓ పక్క కరెంటు బిల్లులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆస్తిపన్ను కూడా పెంచడం విమర్శలకు ఆజ్యం పోస్తోంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నందున ప్రజలపై భారం మోపి వాటిని తీర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. పన్నుల విషయంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోంది. దీంతో విమర్శలు మూటగట్టుకుంటోంది. భవిష్యత్ లో దీని పర్యవసానం తీవ్రంగా ఉండే వీలుందని చెబుతున్నారు.
Also Read:CM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?
[…] Also Read: ఏపీలో ఆస్తిపన్ను భారం మోపుతున్న ప్రభ… […]