https://oktelugu.com/

Congress: ప్రియాంక అంటే రాహుల్ కు భయమా?.. అందుకే ప్రకటించడం లేదా?

Congress Rahul Priyanka gandhi : కాంగ్రెస్ అనే మహాసముద్రంలో అందరి కలిసిపోవాల్సిందే. అదో కప్పెల తక్కెడ.. ఎవరైనా అందులోంచి పైకి  ఎదుగుతామంటే కిందనున్న వారు వారిని లాగేస్తారు. ఎదగనీయరు. తెలంగాణ కాంగ్రెస్ లో యువకుడైన రేవంత్ రెడ్డిని సీనియర్లు ఎంతగా తొక్కేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇక్కడే కాదు.. జాతీయ కాంగ్రెస్ లోనూ ఉంది. ఒకే తల్లి సోనియమ్మ కడుపున పుట్టిన బిడ్డల్లో కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా రాహుల్ తాహతు సరిపోక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2021 / 10:42 AM IST
    Follow us on

    Congress Rahul Priyanka gandhi : కాంగ్రెస్ అనే మహాసముద్రంలో అందరి కలిసిపోవాల్సిందే. అదో కప్పెల తక్కెడ.. ఎవరైనా అందులోంచి పైకి  ఎదుగుతామంటే కిందనున్న వారు వారిని లాగేస్తారు. ఎదగనీయరు. తెలంగాణ కాంగ్రెస్ లో యువకుడైన రేవంత్ రెడ్డిని సీనియర్లు ఎంతగా తొక్కేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇక్కడే కాదు.. జాతీయ కాంగ్రెస్ లోనూ ఉంది. ఒకే తల్లి సోనియమ్మ కడుపున పుట్టిన బిడ్డల్లో కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా రాహుల్ తాహతు సరిపోక వైదొలిగాడు. ఆస్థానంలోకి ప్రియాంకను రానీయడం లేదని.. ప్రియాంక రాజకీయ ఎదుగుదలను రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నాడని ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రియాంకను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించకపోవడానికి కారణం అదేనంటున్నారు.

    priyanka gandhi rahul gandhi

    2022 మార్చిలో ఉత్తరప్రదేశ్ పాలక వర్గం గడువు ముగియనుంది. అంటే అంతకుముందే ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ నేపథ్యంలో జనవరి లేదా ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్లో అధికారం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి పాగా వేసేందుకు వ్యూహ రచన చేస్తుండగా ఈసారి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తర ప్రదేశ్ బాధ్యతలను ప్రియాంక తీసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే రాహుల్ మాత్రం అందుకు సుముఖంగా ఉన్నాడా..? లేడా..?

    ఉత్తరప్రదేశ్లోని ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటే ఢిల్లీ పీటంపై కూర్చొవచ్చు. ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లలోనూ తమ జెండాలను ఎగురవేయాలని ఆయాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఈ రాష్ట్రంలోని రాయబరేలీ నుంచి ప్రతినిధిగా ఉన్నారు. దీంతో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే వివిధ ప్రణాళికలను రచిస్తోంది.

    యూపీలో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ వెనుకబడి ఉంటోంది. ఇక్కడి పార్టీకి సరైన నాయకుడు లేకపోవడతో పార్టీకి ఈ పరిస్థితి పట్టిందని కిందిస్థాయి నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఆ బాధ్యత తీసుకుంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ యూపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు పునియా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే 20 మందితో ప్రచార కమిటీని నియమించింది. ఈ కమిటీకి పునియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానమ్మ ఇందిర వలె ధైర్య సాహసాలున్న ప్రియాంక గాంధీ సారధ్యంలోనే కాంగ్రెస్ ముందుకు వెళుతుందని తెలిపారు.

    ప్రియాంక యూపీ బాధ్యతలపై కొత్త స్వరం వినిపిస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ సారధ్యంలోనే ముందుకు వెళ్తామని పునియా ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ధైర్య సాహసాలను చూసి ఆమె అన్న రాహుల్ గాంధీ భయపడుతున్నారని అన్నారు. అందుకే ఆమెను 2017 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కేవలం రాష్ట్రానికే పరిమితమవుతారని, ప్రియాంక సేవలు జాతీయంగా అవసరమున్నాయని రాహుల్ భావిస్తున్నట్లు పీకే తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మందుండి అన్ని నడిపించినా ఆమె కేవలం రాష్ట్రానికే పరిమితం చేయడం ఇష్టం లేదని, ఆమె ధైర్య సాహసాలు జాతీయంగా అవసరమని రాహుల్ గాంధీకి, ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు సమాచారం. అందువల్ల ప్రియాంక జాతీయ నేతగానే కొనసాగుతారని అనుకుంటున్నారు.

    ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేనట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కాంగ్రెస్ కు దూరంగా ఉంటోంది. గత కొంత కాలంగా ఆ పార్టీ కాంగ్రెస్ తో స్నేహం చేస్తూ వస్తోంది. కానీ ఇప్పడు సమాజ్ వాదీ పార్టీతో కలిసి నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బీఎస్పీ అధినేత మాయవతి సైతం ఇన్నాళ్లు కాంగ్రెస్లో ఉన్నా ఆ పార్టీ సైతం ఒంటరిగానే వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారం సంగతి ఎలా ఉన్నా గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవడానికి ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే యూపీలో పర్యటిస్తున్నారు.