School Teacher: వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ ప్రతీ రోజు ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు, వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన జరిగింది. ఓ కిరాతకుడు స్కూల్ టీచర్‌ను వేధింపులకు గురి చేయడం వల్ల ఆమె తన ప్రాణాలు తానే తీసుకుంది. వివరాల్లోకెళితే..

తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలోని నన్నిళంలో ఉన్న మరుత్తువాంచేరి శివాలయం వీధికి చెందిన గణేశన్ కూతురు సత్య. ఈమెకు పదేళ్ల కిందట ప్రభు అనే పర్సన్‌తో మ్యారేజ్ అయింది. భర్తతో పలు విషయాల్లో మనస్పర్థలు రావడంతో సత్య తండ్రి వద్దకే వచ్చేసింది. ఈ క్రమంలోనే సత్య తన కూతురు, కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయింది.
పేరాలంలోని ప్రైవేట్ స్కూల్‌లో చాలా కాలం నుంచి పని చేస్తున్న ఈమె..ఆ స్కూల్‌కు అన్నీ తానై వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆ పాఠశాల హెడ్ టీచర్‌గా ఉన్న ఆమె సూసైడ్ చేసుకుంది. సూసైడ్‌కు గల కారణాలు తొలుత సరిగా తెలియ రాలేదు. భర్తకు దూరంగా ఉండటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు అసలు నిజం బయటకు వచ్చింది. స్కూల్ యజమాని వేధింపుల వల్లే సదరు స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకుందని తేలింది. విషం తాగి సదరు స్కూల్ టీచర్ సూసైడ్ చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: PM Modi: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ వార్నింగ్.. పరివర్తన చెందాలంటూ క్లాస్..
ప్రాథమిక విచారణలో స్కూల్ యజమాని వేధింపుల వల్లే స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకుందని స్పష్టమైంది. స్కూల్ టీచర్ బంధువులు ఈ విషయం తెలుసుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యజమానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సదరు స్కూల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: AP CM Jagan: కోర్టు అక్షింతలు వేసినా వెనక్కు తగ్గని జగన్ సర్కారు.. కర్నూలుకు ఆఫీసుల షిఫ్టింగ్..