కలెక్టర్ల అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు

రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 2:03 pm
Follow us on

రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది…అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం… కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23కు చేరింది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారు 29,672 మంది, వీరిలో హోమ్ ఐసోలేషన్ లో 29,496 మంది ఉన్నారు. హాస్పిటల్ ఐసోలేషన్ 178 మంది ఉన్నారు.