వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. 11రోజులుగా ఢిల్లీలో రైతులు నిరసన చేపడుతుండగా వారికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఈక్రమంలోనే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చించినా ఫలితం మాత్రం రాలేదు.
Also Read: ‘భారత్ బంద్’పై కొర్రీలు పెడుతున్న మమతా బెనర్జీ..!
దీంతో రైతు సంఘాల నాయకులు రేపు(డిసెంబర్ 8న) భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 11నుంచి 3గంటల వరకు భారత్ బంద్ కొనసాగుతుందని రైతుల సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సైతం వ్యక్తిగతంగా సంఘీభావం తెలుపగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
భారత్ బంద్ పై నేపథ్యంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్‌ను వర్చువల్ గా మోదీ ప్రారంభించి మాట్లాడారు. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమంటూ వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమని చెప్పారు. శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని తెలిపారు.
Also Read: చైనా మళ్లీ దుస్సాహసం.. సరిహద్దుల్లో కుట్ర
రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు రైతులు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చినా మోదీ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు కూడా భవిష్యత్తులో రైతులకు మేలు చేస్తాయని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. దీంతో వ్యవసాయ బిల్లులపై మోదీ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్