https://oktelugu.com/

తిరుపతి బైపోల్: పవన్, బీజేపీ పొత్తు పొడిచేలా లేదే?

జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో పోటీచేయకుండా వైదొలిగి ఆయన బీజేపీకి చేసిన త్యాగం అందరి కళ్ల ముందే ఉంది.. ఇక  పవన్ రుణాన్ని బీజేపీ తీర్చుకోవాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఆ పని చేసేలా లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఉమ్మడిగానే తిరుపతిలో పోటీచేసేందుకు జనసేన, బీజేపీలు గతంలో నిర్ణయించారు. టికెట్ విషయంలో ఇంకా ఎవరికనేది తేలలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 08:17 PM IST
    Follow us on

    జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో పోటీచేయకుండా వైదొలిగి ఆయన బీజేపీకి చేసిన త్యాగం అందరి కళ్ల ముందే ఉంది.. ఇక  పవన్ రుణాన్ని బీజేపీ తీర్చుకోవాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఆ పని చేసేలా లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఉమ్మడిగానే తిరుపతిలో పోటీచేసేందుకు జనసేన, బీజేపీలు గతంలో నిర్ణయించారు. టికెట్ విషయంలో ఇంకా ఎవరికనేది తేలలేదు.  కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ఒక కమిటీ కూడా వేసింది. తిరుపతి టికెట్ తమకే కావాలని పవన్ పట్టుదలతో ఉన్నాడు. బీజేపీ కూడా జీహెచ్ఎంసీ, దుబ్బాక ఊపుతో విడిచే పరిస్థితి లేదు. దీంతో టికెట్ తేలకుండానే జనసేన, బీజేపీలు సొంతంగా ప్రచార పర్వంలోకి దూకడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే పొత్తు పొడిచేలా కనిపించడం లేదని తెలుస్తోంది.

    Also Read: పీసీసీ రేసులో జగ్గూ భాయ్ ఆగయా?

    తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే బీజేపీ ప్రచారం షూరూ చేసింది.  నివర్ తుఫాన్ పై బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం  చిత్తూరు జిల్లాలో రోడ్లపై జగన్ ఒకసారి  నడవాలంటూ సవాల్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సైతం తిరుపతిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో బీజేపీ సైతం సొంతంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్నట్టే కనిపిస్తోంది.

    ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు.  నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను ఓదార్చుతానంటూ జనసేనాని  ప్రచారం ప్రారంభించేశాడు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు.అయితే పవన్ వ్యూహం నివర్ తుఫాన్ బాధితులే కాకుండా తిరుపతి ఉప ఎన్నికపైనే జరుగుతోందని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రధానంగా పవన్ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. రైతులకు సాయం చేయనందుకు తాజాగా ఇంట్లోనే దీక్ష చేపట్టారు. జోరు వర్షంలోనూ తిరుపతిలో పర్యటించి కాకపుట్టించారు. పవన్ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలా సడెన్ గా బయటకు వచ్చాడని అంటున్నారు.

    Also Read: కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న రజినీకాంత్ !

    తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇలా మిత్రులైన పవన్ కళ్యాణ్, బీజేపీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుడడం హాట్ టాపిక్ గా మారింది.  బీజేపీ-జనసేన ఏపీలో పొత్తులో ఉన్నాయి. అది తేలకుండానే ఇప్పుడు ఎవరికి వారు ప్రచార పర్వలోకి దూకడం రెండు పార్టీల శ్రేణులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి. ఇది రెండు పార్టీలకు చేటు తెస్తుందని అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్