Homeజాతీయ వార్తలుModi vs Mamata Banerjee : పిచ్చి మమత.. సందేశ్ ఖలీ తో ఆగిపోవడానికి మోడీ...

Modi vs Mamata Banerjee : పిచ్చి మమత.. సందేశ్ ఖలీ తో ఆగిపోవడానికి మోడీ ఏమన్నా శంకరమఠం నడుపుతున్నాడా?

Modi vs Mamata Banerjee : ఆమధ్య పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖలీ వివాదం గుర్తుంది కదా.. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తమపై అత్యాచారం చేశారని చాలామంది మహిళలు ఆరోపించారు. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి బాసటగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. ఆ బాధిత మహిళలకు అండగా ఉండాల్సింది పోయి.. అక్కడి అధికార పార్టీ నాయకులు హింసకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మరణాలు చోటుచేసుకున్నాయి. సహజంగానే బిజెపి అంటేనే అంతెత్తున ఎగిరిపడే మమతా బెనర్జీ.. ఈ విషయంలో తన పార్టీ నాయకులను వెనకేసుకొచ్చింది. పైగా బిజెపి రాద్ధాంతం చేస్తోందని ఆరోపించింది.. మణిపూర్లో సంగతేంటి? గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్ బానో వ్యవహారం ఏంటి? అంటూ కడిగిపారేసింది. ఇంకోసారి ఇలా నా రాష్ట్రంలో నిరసనలు చేపడితే మామూలుగా ఉండదు అంటూ బిజెపి నాయకులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఉదంతం చేరిన తర్వాత నరేంద్ర మోడీ ఎంటర్ అయ్యారు.

సందేశ్ ఖలీ లో బాధిత మహిళలను పరామర్శించారు. మమతా బెనర్జీ పై విమర్శలు చేశారు. ఒక మహిళ అయి ఉండి.. సాటి మహిళలపై అత్యాచారం జరిగితే కనీసం నోరు మెదపడం లేదని.. పైగా ఆమె సొంత పార్టీ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. కానీ, అప్పట్లో చాలామంది నరేంద్ర మోడీ ఆ విషయం ఆ వరకే పరిమితమైతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆ మీటింగ్లో మీరు త్వరలో మమతా బెనర్జీ వణికి పోయే వార్త వింటారని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఆ విషయాన్ని అప్పట్లో చాలా మంది లెక్కలోకి తీసుకోలేదు . కానీ, నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా చెప్పారు, తీసుకున్నారు కూడా. సీన్ కట్ చేస్తే ఎన్నికల ముందు మమతా బెనర్జీకి పెద్ద తలకాయ నొప్పి. ఆమె అల్లుడికి మరింత ఇబ్బంది. ఇప్పుడైతే హైకోర్టు తీర్పు చెప్పేసింది. ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయితే సీన్ వేరే విధంగా ఉంటుంది. శారద స్కాం లో ఇదే స్థాయిలో విచారణ చేశారు కదా? ఏమైనా జరిగిందా? అనే అనుమానం ఉండొచ్చు. అప్పటి లెక్కలు వేరు. ఇప్పటి మోడీ ఎత్తులు వేరు. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు మోడీ పకడ్బందీ ప్లాన్ వేశాడు.

2016లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 25,753 ఉపాధ్యాయులను నియమించింది. ఈ భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే వాటిని తెరపైకి రానివ్వకుండా మమతా బెనర్జీ చాలా తెలివిగా ఎత్తులు వేశారు. పైగా ఈ రిక్రూట్మెంట్ లో ఆమె అల్లుడు అభ్యర్థుల నుంచి భారీగానే గిల్లాడని.. అందువల్లే ఖాళీ ఓఎంఆర్ షీట్లను చాలామంది అభ్యర్థులు సమర్పించారని కోల్ కతా హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. దేబాంగ్స్ బసక్, షబ్బీర్ రషీది తో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని ఏకీపడేసింది. అంతేకాదు ఇన్ని రోజులపాటు ఉద్యోగాలు వెలగబెట్టిన ఉపాధ్యాయులు తమ జీతాలను వడ్డీతో సహా నాలుగు వారాల్లోగా చెల్లించాలని కోర్టు చెప్పేసింది. అయితే ఇందులో సోమదాసు అనే ఉపాధ్యాయుడికి క్యాన్సర్ సోకడంతో కోర్టు మానవతా దృక్పథంతో అతనిని వదిలిపెట్టింది. అంతేకాదు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పై తదుపరి విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సిబిఐ ఆదేశించింది.

సో ఈ లెక్కన మమతా బెనర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్టే పని నరేంద్ర మోడీ విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రజల ముందు ఆమెను దోషిగా నిలబెట్టాడు. కోర్టు తీర్పు తర్వాత మమతా బెనర్జీ, ఆమె అల్లుడు ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు గానీ.. అవి నిలబడే పరిస్థితి లేదు. ఆమధ్య బెంగాల్ ఎన్నికల్లో కాలుకు కట్టుకట్టుకొని మమతా బెనర్జీ ప్రచారం చేసింది. ఇటీవల నుదుటన రక్తంతో ఆసుపత్రిలో చేరింది. ఈ లెక్కన ఈసారి ఏం చేస్తుందో, ఒకవేళ చేసినా బెంగాల్ ఓటర్లు నమ్ముతారా.. నమ్మే అవకాశం మోడీ ఇస్తాడా.. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి రఫ్ గా పదికి మించి సీట్లను బిజెపి అంచనా వేస్తోంది. వాటిని గెలుచుకునే విధంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ లో మాడిపోయిన వాసన వస్తుంది. ఈ మాడిపోవడం ఇక్కడ వరకే ఆగుతుందా.. ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మోడీ చేతిలోనే ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular