https://oktelugu.com/

PM Modi- Pawan Kalyan : హిమాలయాలకు వెళ్లిపోతావా సామీ.. మోడీ జోక్ కు పవన్ సమాధానం ఇదీ

ఢిల్లీలో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖ గుప్త తో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Written By: , Updated On : February 20, 2025 / 03:46 PM IST
PM Modi- Pawan Kalyan

PM Modi- Pawan Kalyan

Follow us on

PM Modi- Pawan Kalyan :  ప్రధాని మోదీతో( Prime Minister Modi) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ప్రధాని మోడీ సైతం ఆసక్తిగా ఉంటారు. ఇది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. ఏపీ సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ప్రధాని మోదీ. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరులతో చనువుగా గడిపారు. వారిద్దరితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఇప్పుడు అటువంటి ఘటనే ఆవిష్కృతం అయింది. ఢిల్లీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకల్లో పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించడం విశేషం.

* కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేఖ గుప్త ( Rekha Gupta)ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రేఖ గుప్తా తో లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం గా పరమేశ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కీలక నేతలు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రాగలిగింది. అందుకే ప్రమాణ స్వీకార వేడుకలను ఘనంగా నిర్వహించింది.

* పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా
వేదికపై ఏపీ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ వేదికపై ఉన్న నేతలను పలకరిస్తూ, నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి కాసేపు ఆగారు. ఆసక్తికరంగా ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ తో పాటు పక్కనే ఉన్నవారు నవ్వుతూ మాట్లాడారు. ఇది అంతటా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ తో ఏం మాట్లాడారని అంతటా చర్చ నడిచింది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. హిమాలయాలకు వెళ్లిపోతారా అంటూ ప్రశ్నించారని.. అందుకు కొంత సమయం ఉందని ప్రధాని మోదీ అన్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మొత్తానికైతే ఢిల్లీలో ప్రధాని పవన్ కళ్యాణ్ తో ముచ్చట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Pawan Kalyan - ఆగి మరీ PAWAN ను పలకరించిన ప్రధాని.. చంద్రబాబుకు షేక్ హ్యాండ్ | Oneindia Telugu