spot_img
Homeజాతీయ వార్తలుEmergency in India- Modi: ఎమర్జెన్సీ కాలంలో సర్దారుగా అవతారమెత్తిన ప్రధాని మోదీ

Emergency in India- Modi: ఎమర్జెన్సీ కాలంలో సర్దారుగా అవతారమెత్తిన ప్రధాని మోదీ

Emergency in India- Modi: ఎమర్జెన్సీ నాటి రోజులవి. ఓ యువకుడు తలపాగా ధరించి, గడ్డం పెంచి సిక్కుగా మారాడు. సర్దార్ వేషధారణతో అసలు రూపం గుర్తుపట్టని విధంగా తయారయ్యాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. ఆయన ఎవరో తెలుసా మన ప్రధాని నరేంద్ర మోదీ. అది 1975, జూన్ 25… అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సిఫార్సుపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితి తదుపరి 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీతో సహా చాలా మంది విపక్ష నేతలు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలపైనే అధికంగా దాడులు జరిగాయి. వీరిలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మోదీ తన వేషాన్ని మార్చుకున్నారు.

Emergency in India- Modi
Modi

తలపాగా ధరించి, గడ్డం పెంచి సిక్కుగా మారారు. ఈ సర్దార్ వేషధారణలోనే ప్రధాని నరేంద్రమోదీ పోలీసులకు చిక్కారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నేతలను రెండేళ్లపాటు జైల్లో పెట్టి, పత్రికా స్వేచ్ఛకు ‘తాళం’ వేసి, సామాన్య ప్రజలకు సైతం ఇబ్బందులు కలిగించారనే ఆరోపణలున్నాయి. నాటి ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ క్రియాశీల పాత్ర పోషించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న నరేంద్ర మోదీకి ఆందోళనలు, సదస్సులు, సమావేశాలు, సాహిత్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను అప్పగించారు.

Also Read: Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం

Emergency in India- Modi
indira gandhi

ఆ సమయంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత కేశవరావు దేశ్‌ముఖ్‌ను గుజరాత్‌లో అరెస్టు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ తనను కూడా అరెస్టు చేస్తారని పసిగట్టి సర్దార్ అవతారం ఎత్తారు. ఎమర్జెన్సీ నాటి గురుతులను నెమరువేసుకునే క్రమంలో ప్రధాని మోదీ సర్దారుగా మారిన నాటి ద్రుశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

Also Read:Anantapur District Puleti Erragudi: ఆ మహిళ అలక.. గ్రామానికి చేటు తెప్పించిందట

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Oktelugu Epaper