https://oktelugu.com/

NTR Centenary Celebrations: ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భారతరత్న పరిస్థితి ఏమిటి ?

NTR Centenary Celebrations: తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోవాలని ఆయన అభిమానులు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఎన్టీఆర్ జయంతి ప్రారంభ వేడుకలను […]

Written By:
  • Shiva
  • , Updated On : May 18, 2022 / 06:07 PM IST
    Follow us on

    NTR Centenary Celebrations: తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోవాలని ఆయన అభిమానులు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

    NTR Centenary Celebrations

    ఎన్టీఆర్ జయంతి ప్రారంభ వేడుకలను ఆయన కుమారుడు హిందుపపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంబభించనున్నారు.మొదట ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో శతజయంతి వేడుకలు ప్రారంభం అవనున్నాయి. అనంతరం గుంటూరు, తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలయ్య హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం టిడిపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read: konaseema district name: కోనసీమ జిల్లా పేరు మార్చిన జగన్ ప్రభుత్వం.. కొత్త పేరు ఇదే

    ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా స్థితని , తెలుగు రాజకీయాల గతిని మార్చిన ఒక శక్తి, అంత గొప్ప మహానుభావుడికి భారత రత్న రాకపోవడం నిజంగా భారతరత్నకే అది అవమానం. ‘మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం’ అని అభిమానులు కోరుతున్నారు.

    NTR

    అయితే, ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అనే అభిమానుల కోరిక ఎప్పటికైనా తిరుగుతుందా ? నేటి రాజకీయ అవసరాలను బట్టి బిరుదులు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ భారత రత్న ఇస్తారా ? అయినా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.

    NTR

    తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఎన్టీఆర్ ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ లోకాన్ని విడిచి పదుల సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆయనను తెలుగు ప్రజలు తమ హృదయాల్లో ఇప్పటికీ శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. యావత్తు అభిమాన లోకంతో పాటు సినీ లోకం కూడా ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు.

    Also Read:Telangana Congress: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందా?
    Recommended Videos


    Tags