బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. మరోవైపు వైజాగ్ లో విష వాయువు ప్రభావం కారణంగా గొంతు, చర్మ సంబంధ సమస్యలతో స్థానికులు బాధపడ్డారు. దీంతో పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. 1000 నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 800 […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 4:51 pm
Follow us on

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు.

మరోవైపు వైజాగ్ లో విష వాయువు ప్రభావం కారణంగా గొంతు, చర్మ సంబంధ సమస్యలతో స్థానికులు బాధపడ్డారు. దీంతో పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. 1000 నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 800 మందికిపైగా ఆస్పత్రికి తరలించారని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు.