PRC Issue in AP: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా ముదురుతున్నది. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ ఉత్వర్వులతో ఈ వివాదం తెర మీదకు వచ్చింది. పీఆర్సీ విషయమై ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. సమ్మె బాట పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో చర్చించేందుకుగాను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అలా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహించాలని ఏపీ సర్కారు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలకు బాధ్యతలు అప్పజెప్పింది. కాగా, ఉద్యోగ సంఘాల నేతలకు చర్చల సమయంలో మంత్రులకు గట్టి షాక్ ఇచ్చినంత పని చేశారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..

పీఆర్సీ వివాదం నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. చర్చల కోసం మంత్రులు సెక్రెటేరియట్‌కు వచ్చారు. ఉదయం 11 గంటలకు వచ్చిన మంత్రులు ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురు చూశారు. కానీ, నేతలు అయితే రాలేదు.
Also Read: జగన్, మంత్రులకు షాక్.. ఏపీలో మోగిన సమ్మె సైరన్
పీఆర్సీ వివాదంపై చర్చలకు తాము రాలేమని, పీఆర్సీ జీవోలు వెనక్కు తీసుకుంటేనే వస్తామని నేతలు పట్టబడుతున్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఉద్యోగ సంఘాల నేతలు తమ షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఈ లో పే హై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, విచారణ జరగడంతో వేతనాలపై హైకోర్టు వ్యాఖ్యలతో ఈ వ్యవహారంలో మరో కోణం బయటకు వచ్చింది.

గెజిటెడ్ ఉద్యోగులసంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సమ్మె నోటీసు ఇస్తున్న 12 మంది ఉద్యోగసంఘాల నేతల్ని హైకోర్టు పిలిపించింది. ఈ క్రమంలో సమ్మె గురించి హై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా కీలకంగా మారనుంది. కాగా, హైకోర్టు విచారణతో సంబంధం లేకుండా ఉద్యోగులు సమ్మె నోటీసు ఇస్తారా? లేదా హైకోర్టు వ్యాఖ్యలతో వెనక్కు తగ్గుతారా ? లేదా ? అనే విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.