Prashanth Kishor Report: దేశంలో ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త ప్రవాంత్ కిషోర్ హవా కొనసాగుతోంది. ఆయన అటు కాంగ్రెస్ కు ఇటు టీఆర్ఎస్ కు ఏకకాలంలో సంధానకర్తగా మాననున్నారు.దీంతో అందరిలో అయోమయం నెలకొంది. ఒకే సమయంలో రెండు పార్టీలకు ఎలా సమన్వయం చేస్తారనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం బీజేపీని ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు కలవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. దేశంలోబీజేపీపై వస్తున్నవ్యతిరేకతను సద్వినియోగం చేసుకునిరాబోయే ఎన్నికల్లో దాన్ని అధికారానికి దూరం చేయాలని చూస్తున్నారు. ఇందుకోసమే వ్యూహాలురచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చాల్సి ఉంటుందని పీకే స్పష్టం చేయడంతో కేసీఆర్ నిర్ణయం పై ఆధారపడి ఉంది.

బీజేపీపై ప్రజావ్యతిరేకత ఎక్కువవుతోంది. దీంతో దాన్ని మనం వినియోగించుకుని వచ్చే ఎన్నికల్లో దానికి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అటు కాంగ్రెస్ కు ఇటు టీఆర్ఎస్ కు ఒకేసారి ఎలా సారధ్యం వహిస్తారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ కూడా తాము బీజేపీకి కాంగ్రెస్ కు రెండు పార్టీలకు సమదూరం పాటిస్తామని చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా ఇంకా ఏ పార్టీలతోనైనా జట్టు కట్టేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు.దీంతో పీకే వ్యూహాలు ఎలా అమలు చేస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది.
ఈనేపథ్యంలో రాష్ట్రంలో పీకే విధానాలు ఎలా అమలు చేస్తారు? రెండు వైరుధ్యమున్న పార్టీలతో ఎలా వ్యవహరిస్తారు? అనే దానిపై అందరిల ఉత్కంఠ ఏర్పడింది. భవిష్యత్ లో కూడా పీకే వైఖరి ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీల్లో ప్రధానంగా చర్చ సాగుతోంది. పీకేకు డబ్బే ప్రధానం పార్టీలు కాదనే వాదనలు కూడా వస్తున్నాయి. లేకపోతే రెండు పార్టీలకు ఎలా పనిచేస్తానని ఒప్పుకున్నారనిప్రశ్నిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తో ఉండాలి లేదంటే కాంగ్రెస్ తో ఉండాల్సి ఉన్నా ఆయన రెండు పార్టీలకు పని చేస్తానని చెప్పడం మాత్రం కరెక్టు కాదని ప్రశ్నిస్తున్నారు.

రాష్ర్టంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మింగుడుపడటం లేదు. పీకే సారధ్యంలో రెండు పార్టీలు ఎంత మేర ఫలితాలు సాధిస్తాయనే దానిపైనే ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన శత్రువులైన రెండు పార్టీలను ఎలా అధికారంలోకి తీసుకురాగలుగుతారు. అయితే ఏదో ఒక పార్టీ అధికారంలోకివస్తుంది. మిగతా ఒకటి మాత్రం గమ్మున ఉండాల్సిందే. ఈ లెక్కన టీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీ రెండింట్లో ఏది అధికారానికి దూరం కావాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో నేతల్లో కూడా ఆందోళన నెలకొంది. పీకే తీరు వివాదాస్పదంగా మారుతోంది.
టీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలకు ప్రజావ్యతిరేకత ఉంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఖాయమనే రిపోర్టు పీకే నుంచి వచ్చింది. దీంతో కేసీఆర్ వారి పట్ల ఏం చర్యలు తీసుకుంటారు? టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారా?లేక వారిని దూరం పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు పీకే ఫీవర్ నేతల్లో కూడా పట్టుకుంది. పీకే సర్వే నివేదిక ఆధారంగా కేసీఆర్ చర్యలు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టికెట్ల భయం కూడా పట్టుకుంది.
Recommended Videos