Homeజాతీయ వార్తలుCM Kcr- Prashant Kishor: కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ...

CM Kcr- Prashant Kishor: కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలుస్తాయా?

CM Kcr- Prashant Kishor: రాజకీయాల్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆయన జోడు గుర్రాల సవారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బు కోసం దేనికైనా సిద్ధమేనన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తానని వారి దగ్గర మాట తీసుకుని ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేందుకు సిద్ధం కావడం చూస్తుంటే డబ్బు కోసం గడ్డి తినేందుకు కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో పరస్పర శత్రువులుగా ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎలా ఏకకాలంలో సేవలందిస్తారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పీకే వ్యవహారం గందరగోళంగా ఉందని పెదవి విరుస్తున్నారు.

CM Kcr- Prashant Kishor
Prashant Kishore and KCR

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం కోసం పీకే వ్యూహాలు ఫలించడంతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయనే ఉద్దేశంతో పీకే కోసం అన్ని రాజకీయ పార్టీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ తో ఉంటానని చెప్పి మళ్లీ టీఆర్ఎస్ తో మంతనాలు జరపడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలువస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీకే రెండు పార్టీలకు ఎలా సారధ్యం వహిస్తారని నేతల్లో అంతర్మథనం మొదలైంది. అసలుపీకే వ్యూహమేంటి? రెండుపార్టీలను ఎందుకు చేరదీస్తున్నారు? ఎలా డీల్ చేస్తారు? టీఆర్ఎస్ , కాంగ్రెస్ పరస్పరం విరుద్ధ భావాలు ఉన్న పార్టీలు కావడంతో రెండు పార్టీలకు ఎలా సలహాలు, సూచనలు ఇస్తారని సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్నపరిణామాల నేపథ్యంలో పీకే విషయం వివాదాస్పదంగా మారుతోంది.

Also Read: Acharya Prerelease Event : భారతీయ సినిమా ఓ మతం అయితే.. రాజమౌళి దానికి పీఠాధిపతి: చిరంజీవి ఇలా అన్నాడేంటి?

ఇదివరకే కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పీకేకు అవకాశం ఇచ్చిందో తెలియడం లేదు. బీజేపీతో ఉన్న వైరం కారణంగానే పీకే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనా మళ్లీ టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారనే విషయం అందరిలో సవాలక్ష ప్రశ్నలకు వేదికవుతోంది. కేసీఆర్ కూడా రెండు రోజులుగా పీకేతో సమావేశమై పార్టీ విధానాలు, వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో ఎన్ని స్థానాల్లో టీఆర్ఎస్ కు బలముందనే దానిపై నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే పీకే వ్యూహాలు అమలు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

CM Kcr- Prashant Kishor
CM Kcr- Prashant Kishor

తెలంగాణలో ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలో కేసీఆర్, పీకే పాచికలు పనిచేస్తాయా? కాంగ్రెస్,బీజేపీని ఎదుర్కొని మనుగడ సాధిస్తుందా? మూడో సారి అధికారం చేజిక్కించుకుంటుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. మొత్తానికి పీకే విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలు మారేందుకు మార్గాలు కనిపిస్తున్నాయి. దీనికి గాను ఇప్పటి నుంచే పార్టీలు కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో పార్టీల వైఖరులు మార్పు చెందుతున్నట్లు స్పష్టంగా గోచరిస్తోంది.

Also Read:Minister Ajay Kumar: మంత్రి అజయ్ కుమార్ పై చర్యలు తప్పవా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Modi Jammu Tour: తుపాకుల మోత.. ఉగ్రవాదుల దాడుల భయం..ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితి ఇది. ఇక్కడి ప్రజలు భిక్కుభిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించసాగారు.. అయతే 370 ఆర్టికల్ రద్దు తరువాత కొన్ని ప్రాంతాల పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా జమ్మూకు కేంద్రం భారీగా నిధులను విడుదల చేయిస్తూ అభివృవైపు వెళ్లేలా కృషి చేస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు జమ్మూలోని సాంబా జిల్లా పేరు మారుమోగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి కార్బన్ రహిత గ్రామంగా ‘పల్లి’ నిలిచింది. 500 కిలోల వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఇక్కడ నెలకొల్పారు. దీనిని కేవలం 20 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఆ గ్రామ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular