
MAA Elections Controversy: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ మధ్య సాగిన రసవత్తర పోరులో మాటల తూటాలు పేలాయి. ఒకరి పై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఓ దశలో నువ్వా ? నేనా ? అంటూ రచ్చకెక్కారు. ఆవేశాలు పెరిగాయి, పగలు రగిలాయి. ఇక నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాష్ ఫ్యానెల్ – విష్ణు బ్యాచ్ ఎన్నికల కోసం ఉదయం నుంచి అలెర్ట్ అయ్యారు.
అయితే, ఈ సందర్భంగా.. మోహన్ బాబు ఎన్నికల దగ్గరకు వచ్చారు. మోహన్ బాబును చూసిన ప్రకాష్ రాజ్, నేరుగా మోహన్ బాబు దగ్గరకు వెళ్లి పలకరించారు. మోహన్ బాబు కూడా ప్రకాష్ రాజ్ ను అక్కున చేర్చుకుని కౌగిలించుకున్నారు. పైగా విష్ణు చేయిని ప్రకాష్ రాజ్ చేతిలో పెట్టారు. మొత్తానికి ఈ దృశ్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక నెటిజన్లను కూడా ఈ దృశ్యం షాక్ కి గురి చేసింది. మరి ఎవరు ఎలా రియాక్ట్ అయి ఎలాంటి మెసేజ్ లు చేసారో చూద్దాం. ‘కడుపులో ఎంత కసి వున్నా పైకి కనిపించకుండా నవ్వుతూ నటిస్తూవున్న మహా మహా నటులు’ అంటూ ఒకరు, కాబట్టీ ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది.. మనం వాళ్ళ గొడవలు చూడటం వల్ల మీడియా వాళ్ళకి ఉపయోగం తప్ప, మనకు కాదు’ అని మరొకరు కామెంట్స్ చేశారు.
మరో నెటిజన్ అయితే, ‘మీరు యాక్టర్లు అని తెలుసు గాని, మరీ ఇంత పెద్ద యాక్టర్లని తెలీదు’ అని పోస్ట్ చేశాడు. ‘వీళ్ళు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు ఎంతైనా మహానటులు కదా’ అని ఇంకొకరు, ‘ఇన్ని రోజుల నుంచి ప్రేక్షకులు పిచ్చోళ్ళు అయ్యారు, మీరు మీరు ఒకటి అయ్యారు, సూపర్’ అని మరొకరు, ఎక్కడైనా ఎప్పుడైనా ప్రేక్షకులే ఏర్రి వాళ్ళు అవుతారు, మనమే వాళ్ళకోసం ఏదేదో అనుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళంతా ఒక్కటే’ అంటూ ఒకరు పోస్ట్ లు పెట్టారు.
ఇక మరికొన్ని కామెంట్లు చూద్దాం. ‘మండుతున్న గుండెలు, అయినా “మా”లో తప్పవు ఈ నాటకాలు’, ‘రాజకీయంలో అయినా మూవీస్ లో అయినా అందరూ ఒక్కటే, చివరకి పిచ్చివాళ్లు అయేది అభిమానులే’, ‘మీ గొడవలు పర్సనల్ అనుకుని.. మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా & జనాల్ని ఒక్క సీన్ తో పిచ్చోళ్ళని చేశారు’… ‘మరి ఎందుకు రచ్చ రచ్చ చేసారు, ఇప్పటికైనా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే సినిమా వాళ్లయిన రాజకీయ నాయకులయినా మనల్ని ఎర్రి పప్పలు చేస్తారు’ అంటూ రకరకాల కామెంట్లు పెట్టారు.