Shahid Kapoor: సోషల్ మీడియా యుగంలో అభిప్రాయ వ్యక్తీకరణ చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా సెలెబ్రిటీలు సున్నితమైన విషయాల మీద ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఏకిపారేయడానికి నెటిజెన్స్ సిద్ధంగా ఉంటారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నోరు జారి అబాసుపాలయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. షాహిద్ కపూర్ లేటెస్ట్ మూవీ బ్లడీ డాడీ మూవీ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఓ విలేకరి పెళ్లిపై ఆయన అభిప్రాయం అడగ్గా… కొత్త నిర్వచనం చెప్పాడు. అది మగజాతిని కించపరిచే విధంగా ఉంది.
షాహిద్ మాట్లాడుతూ… పెళ్లి అనేది ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ మీద క్లారిటీ లేని ఓ అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆ కుర్రాడి జీవితాన్ని తన తెలివితేటలతో మార్చుకుంటుంది. అతన్ని ప్రయోజకుడిని చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే పెళ్లి అంటే ఇదే, అన్నాడు. షాహిద్ కపూర్ నిర్వచనం కొందరికి నచ్చలేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా దాడికి దిగారు. పెళ్లి, భార్యాభర్తలు అంటే అంతేనా? అందరూ అలానే ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఒకరినొకరు అర్థం చేసుకుని సాగించేది పెళ్లి బంధం. కేవలం సరిద్దుకోవడాలు మాత్రమే కాదు, అంటున్నారు. మీ అమ్మ ఇలానే చేసిందా? నువ్వు కబీర్ సింగ్ మూవీ చేశావు(అర్జున్ రెడ్డి). ఆ విషయం మాకు తెలుసు. నువ్వు ఆ క్యారెక్టర్ నుండి ఇక బయటకు రా, అక్కడే ఉండిపోకు అని సెటైర్స్ వేస్తున్నారు. అనవసరంగా ఏదో చెప్పి షాహిద్ కపూర్ బుక్ అయ్యాడు. ఇక షాహిద్ ఈ వివాదం నుండి ఎలా బయటపడతాడో చూడాలి.
షాహిద్ కపూర్ ప్రస్తుతం బ్లడీ డాడీ చిత్రంలో నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్ర దర్శకుడు. జూన్ 9న విడుదల కానుంది. కబీర్ సింగ్ మూవీతో షాహిద్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ నమోదు చేశారు. అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఆ ఊపులో మరో తెలుగు హిట్ జెర్సీ రీమేక్ చేశాడు. ఇది మాత్రం వర్క్ అవుట్ కాలేదు