Power Cuts In AP: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పొద్దుపోయక కూడా వేడి సెగ తగ్గడం లేదు. అవసరమైతేన బయటకు రండి… లేకపోతే ఇళ్లలోనే ఉండండి అని వైద్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. ఉద్యోగాలకు, చేతి పనులు చేసుకునే వారు తప్పని పరిస్థితుల్లో ఎండలోకి రాక తప్పడం లేదు. చెమలు కక్కుతూ ఇంటికో, షాపుకో చేరిన తరువాత ఉపమశమనం కోసం ఫ్యాను వేస్తే కరెంటు ఉండకపోవడంపై తీవ్ర నిరాశకు గురువుతున్నారు. వేళాపాళా లేని కరెంటు కోతలతోనూ అల్లాడిపోవాల్సి రావడం.. సామాన్యులు ఉగ్రరూపం దాల్చుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిపోయింది. ఏటా వేసవికాలాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. కరెంటు లేకపోతే ఉండలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పరిశ్రమలకు, గృహావసరాలకు ఏటా కరెంటు వినియోగం పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టు ప్రణాళికలు వైసీపీ ప్రభుత్వం సిద్ధం చేసుకోలేకపోతుందా అన్న ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒడిదుడుకులు ఉంటాయని అనుకుందాం.. మరి రెండో సంవత్సరం, మూడో సంవత్సరం కూడా సమస్య అలాగే ఉండటం బాధ్యాతారాహిత్యానికి నిదర్శనం కాదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఈ ఏడాది అయిన కరెంటు వినియోగాన్ని బట్టి వచ్చే ఏడాదికి సంబంధించి టెండర్లను పిలుస్తారు. ప్రభుత్వ ఉత్పత్తి పోగా మిగిలింది ఎంత అవసరమవుతుందని అంచనా వేస్తారు. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత టెండర్లను కోట్ చేస్తారు. అలా యూనిట్ 1.50 నుంచి రూ.2.00 లోపు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు అలా జరగడం లేదేమోనన్న అనుమానం ప్రస్తుతం విధిస్తున్న కోతలను బట్టి వ్యక్తమవుతుంది.
వైసీపీ ప్రభుత్వం కాల పరిమితి మరో ఎనిమిది నెలల్లో ముగియనుంది. అయినా, కొన్ని విషయాలు ప్రారంభం నుంచే నిష్టూరుస్తుండటం విస్మయానికి గురిచేస్తుంది. పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నా, కరెంటు వినియోగంపై ఒక్కరు కూడా జగన్ కు సలహా ఇవ్వకపోవడం విచారకరం. గత టీడీపీ హయాంలో నిరంతర విద్యుత్ అందజేశారు. వేసవిలో కూడా కరెంటు కోతలు విధించలేదు. ప్రస్తుతం ఇన్వర్టర్లు లేనిదే పనిగడవడం లేదు. సామాన్యుల పరిస్థితి అయితే కొలిమిలో పడినట్లుగా ఉంటుంది. పైగా కరెంటు బిల్లులు అధికంగా చెల్లిస్తూనే.