‘పది పరీక్షల’ పంతం.. జగన్ పీచేముడ్

ఇప్పుడు ఏదీ ముఖ్యం కాదు.. కేవలం ప్రాణాలు కాపాడుకోవడమే మిగిలింది. అంతుకుమించిన ప్రాధాన్యత దేశంలో ప్రపంచంలో మరేం లేదు. అందుకే లాక్ డౌన్ పెట్టి అందరూ ఇంట్లో కూర్చున్నారు. ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలు సాధ్యమా? బీరాలకు పోయిన ఏపీ ప్రభుత్వం నిర్వహించి తీరుతామని ప్రతిన బూనింది.కానీ చివరకు కరోనాకు తలొగ్గింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ […]

Written By: NARESH, Updated On : May 27, 2021 12:45 pm
Follow us on

ఇప్పుడు ఏదీ ముఖ్యం కాదు.. కేవలం ప్రాణాలు కాపాడుకోవడమే మిగిలింది. అంతుకుమించిన ప్రాధాన్యత దేశంలో ప్రపంచంలో మరేం లేదు. అందుకే లాక్ డౌన్ పెట్టి అందరూ ఇంట్లో కూర్చున్నారు. ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలు సాధ్యమా? బీరాలకు పోయిన ఏపీ ప్రభుత్వం నిర్వహించి తీరుతామని ప్రతిన బూనింది.కానీ చివరకు కరోనాకు తలొగ్గింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామంటూ ఏపీ ప్రభుత్వం నొక్కి వక్కాణించింది. తల్లిదండ్రులు, మేధావుల నుంచి ఒత్తిడి వచ్చినా ‘తగ్గేదే లే’ అన్నది.

అయితే కరోనాతో రాష్ట్రాలు, దేశాలు లాక్ డౌన్ దిశగా సాగుతున్న ఈ వేళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యాశాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో కర్ఫ్యూ ఉండడం.. కేసుల సంఖ్య దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు ఉండడంతో ఈ టైంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని సీఎం జగన్ తేల్చారు. కర్ఫ్యూలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పదోతరగతి పరీక్షలను వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం జూలైలో పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికి కరోనా తగ్గితేనే సమీక్ష నిర్వహించి నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.