Post Office Providing Insurance : ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా కూడా తమ కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఎప్పుడు ఏ సమయంలో ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే బీమా ఉండాలి. దీని ప్రీమియం చాలా ఎక్కువగా ఉండటం వలన చాలామంది బీమాకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు మరియు నివాబుప హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా కలిసి సామాన్య ప్రజల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీస్ లలో ఇప్పుడు ప్రత్యేక భీమా ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో మీరు కేవలం రూ.755 కడితే సరిపోతుంది. ఈ కనీసం ప్రీమియంతో మీరు రూ.15 లక్షలు బీమా ప్రయోజనాలను అందుకోవచ్చు. దీంట్లో మీకు రూ.555 ప్రీమియంతో కూడా మరొక చిన్న ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో మీరు రూ.10 లక్షల బీమా ప్రయోజనాలను పొందవచ్చు.
పట్టణాలతోపాటు అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నకరేకల్ సబ్ పోస్ట్ ఆఫీస్ మాస్టర్ సుధాకర్ గారు ఈ స్కీమ్స్ గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వాళ్లు ఈ స్కీమ్స్ కి అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఫామ్ నింపి ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఇవి ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్. ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భీమా అందుతుంది. వాళ్లు ఎంపిక చేసుకున్న స్కీం పై ఆధారపడి ఉంటుంది.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..
ఒకవేళ ప్రమాదవశాత్తు శాశ్వత వికలాంగత వచ్చినా కూడా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు బీమా అందుతుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ మీద మీకు వచ్చే బీమా ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల చదువు కోసం కూడా ఈ స్కీం లో మీరు ప్రత్యేకంగా ఒక లక్ష రూపాయలు కవరేజ్ అందుతుంది. చిన్న స్కీంలో అయితే మీరు రూ.50,000 రూపాయలు పిల్లల చదువు కోసం అందుకోవచ్చు. రోజుకు ఐసీయూ చికిత్స కోసం వెయ్యి రూపాయల నుంచి రూ.2000 వరకు ఇస్తారు. గరిష్టంగా 15 రోజుల వరకు మీకు ఇది వర్తిస్తుంది. ఈ ఖర్చులు కూడా మీరు ఎంపిక చేసుకున్న ప్లాన్ మీద ఆధారపడి ఉంటాయి.