Post Boxes : కాలం మారుతున్న కొద్దీ, మహిళలు కూడా ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. చాలా మంది మహిళలు వివిధ రంగాలలో తమ పేరును సంపాదించుకుంటున్నారు. వారు ఇతర మహిళలకు కూడా ప్రేరణగా మారుతున్నారు. నేడు చాలా మంది మహిళలు పోస్టాఫీసులో కూడా వివిధ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది మహిళలు పోస్టల్ అసిస్టెంట్లుగా, కొందరు సబ్ పోస్ట్ మాస్టర్లుగా, మరికొందరు గ్రామీణ పోస్ట్ మెన్లుగా పనిచేస్తున్నారు. ఈ మహిళల పని చాలా ప్రశంసనీయం, ఎందుకంటే ఈ మహిళలను చూసి, ఈ రంగంలో తమ కెరీర్‌ను ఏర్పరచుకోవడానికి మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా పోస్టాఫీసును 2013లో ఢిల్లీలో ప్రారంభించారు. ఇందులో మహిళా ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు కూడా.
భారతదేశంలో తపాలా సేవలు అందించే సౌకర్యాల గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మన దేశంలో లెటర్ బాక్సులు తరచుగా ఎరుపు రంగులో ఉండటం మీరు గమనించి ఉండవచ్చు. కానీ ఇది కాకుండా అనేక ఇతర రంగుల లెటర్ బాక్స్‌లు ఉన్నాయి. వాటికి వేర్వేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి. లెటర్ బాక్స్ రంగు తరచుగా ఎరుపు రంగులో ఉండటానికి కారణం? ఇతర రంగుల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది?
బ్రిటన్‌లో, పోస్ట్ బాక్స్‌లు వాటి పరిసరాలకు సరిపోయేలా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ తరువాత పోస్ట్ బాక్స్ రంగును ఎరుపు రంగులో ఉంచారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, ఈ రంగు దూరం నుంచి కూడా త్వరగా కనిపిస్తుంది. తరువాత, బ్రిటిష్ కామన్వెల్త్‌లో, అంటే బ్రిటన్ పాలించిన అన్ని దేశాలలో, వారు అక్కడ ఎరుపు రంగు పోస్ట్ బాక్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కారణంగా, నేటికీ భారతదేశంలోని చాలా పోస్ట్ బాక్సుల రంగు ఎరుపు రంగులోనే ఉంది.
పోస్ట్ బాక్స్ లోని ఇతర రంగుల అర్థం ఏమిటి?
రెడ్ పోస్ట్ బాక్స్- ఈ రంగు పోస్ట్ బాక్స్ స్థానిక ప్రదేశాలకు డెలివరీ చేయకూడని మెయిల్‌లను సేకరించడానికి ఉపయోగిస్తారు.
ఆకుపచ్చ పోస్ట్ బాక్స్- ఈ రంగు పోస్ట్ బాక్స్ స్థానిక మెయిల్ సేకరించడానికి ఉపయోగిస్తారు.
బ్లూ పోస్ట్ బాక్స్- ఈ రంగు పోస్ట్ బాక్స్ మెట్రోలకు అంటే పెద్ద నగరాలకు పంపాల్సిన మెయిల్‌లను సేకరించడానికి ఉపయోగిస్తారు.. ఢిల్లీ , చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి ప్రాంతాలకు అన్నమాట.
పసుపు పోస్ట్ బాక్స్- ఈ రంగు పోస్ట్ బాక్స్‌లో, వివిధ రాష్ట్రాల రాజధానులకు సంబంధించిన మెయిల్‌లు సేకరిస్తారు. పాట్నా, భోపాల్, హైదరాబాద్ మొదలైన వాటిలాగే అన్నమా.
Also Read : 5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షలు సంపాదించే సువర్ణావకాశం.. ఈ పోస్టాఫీసు పథకం అద్భుతం