Posani Krishna Murali: పోసాని పశ్చాతాపం.. మారిన పవన్ పై అభిప్రాయం !

Posani Krishna Murali: కమెడియన్ పోసాని ఎటూ కాకుండా అయిపోయాడా అనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం పోసాని హహ బాగా నడిచింది. వరుస సినిమాలతో బాగా సంపాదించుకున్నారు. ఐతే, వైఎస్సార్సీపీ మోజులో ఆయన పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. అంతేకాదు, నమ్ముకున్న జగన్ ఒక పదవి ఇస్తాడని ఆశ పడ్డాడు. కానీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు పోసానికి ప్రస్తుతం జగన్ పార్టీలో గుర్తింపు లేదు. రాజకీయంగా జీరో అయ్యారిప్పుడు. ఇక సినిమాల్లో […]

Written By: Shiva, Updated On : May 7, 2022 5:59 pm
Follow us on

Posani Krishna Murali: కమెడియన్ పోసాని ఎటూ కాకుండా అయిపోయాడా అనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం పోసాని హహ బాగా నడిచింది. వరుస సినిమాలతో బాగా సంపాదించుకున్నారు. ఐతే, వైఎస్సార్సీపీ మోజులో ఆయన పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. అంతేకాదు, నమ్ముకున్న జగన్ ఒక పదవి ఇస్తాడని ఆశ పడ్డాడు.

Posani Krishna Murali, pawan kalyan

కానీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు పోసానికి ప్రస్తుతం జగన్ పార్టీలో గుర్తింపు లేదు. రాజకీయంగా జీరో అయ్యారిప్పుడు. ఇక సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో పోసాని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. తన సన్నిహితులతో పోసాని తన బాధను వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు.

Also Read: Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు..’కు జగన్ స‌ర్కారు శుభవార్త !

పోసాని ఏమి అన్నాడు అంటే.. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టకుండా ఉండాల్సింది. నేను కొన్నిసార్లు ఎక్కువ రెచ్చిపోయాను. అయితే, నా మాటలను ఇంకా బ్యాడ్ గా ప్రమోట్ చేశారు. నిజానికి నేను పవన్ కళ్యాణ్ ని తప్ప.. చిరంజీవి గారిని కానీ మెగా హీరోలను ఎప్పుడు విమర్శించలేదు. కేవలం పార్టీ కారణంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాను’ అంటూ పోసాని చెప్పుకొచ్చాడు.

Posani Krishna Murali, pawan kalyan

ఏది ఏమైనా పోసాని పని అయిపోయింది. ఇప్పుడు పోసానికి ఇండస్ట్రీలో అవకాశాలు బాగా తగ్గాయి. మళ్ళీ దశ తిరుగుతుందా అనేది చెప్పడం కష్టమే. పైగా ఇప్పుడు కామెడీ పంథా కూడా బాగా మారింది. దీనికి తోడు తెలుగు సినిమాల్లో కొత్త కమెడియన్స్ ఎక్కువమంది కనిపిస్తున్నారు.

పైగా ఆ కొత్తతరం కమెడియన్లు చాలా బాగా రాణిస్తున్నారు. పోసాని తరహా కామెడీకి కాలం చెల్లింది. మరి ఈ నేపథ్యంలో పోసాని ఇక మళ్ళీ ఇంకేం ఫామ్ లోకి వస్తాడు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్

Tags