Ambati Rambabu is a Tiger: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు.. హుందాగా వ్యవహరించేవారు సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ విపరీత ధోరణితో, పురుష పదజాలాలు ఉపయోగించేవారు హైలెట్ అవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టిన అంబటి రాంబాబును బాధితుడుగా చూస్తుండడం చాలా అన్యాయం. నడిరోడ్డుపై బూతులతో రెచ్చిపోయిన అంబటి ముమ్మాటికి దోషి. కానీ బాధితుడిగా మార్చి.. రాంబాబు నోటి దూలకు బలైన చంద్రబాబును దోషిగా చిత్రీకరిస్తున్నారు వైసిపి నాయకులు. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం అంబటి రాంబాబు చేసిన తప్పు ఏంటి? ఆయనను అభినందించాల్సింది పోయి జైల్లో పెడతారా అంటూ మాట్లాడారు అంటే ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయో అర్థం అవుతుంది.
కాపు కులం పై దాడి అట..
అంబటి రాంబాబు( ambati Rambabu) అధికారంలో ఉన్నప్పుడు తనకు కులం లేదు.. తన కులం పేరు జగన్ అన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఓ ముఖ్యమంత్రి కి నడిరోడ్డుపై బూతులు తిడుతూ అరెస్టయ్యారు. కానీ అది కాపు కులం మీద దాడి అంటూ.. కాపు నాయకుల అణచివేత అంటూ జగన్ పరామర్శల యాత్ర చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ కాపు నాయకులతో అంబటి కుటుంబం కోసం ఓదార్పు యాత్ర చేయించారు. ఓ ముఖ్యమంత్రిని పోలీసులు, మీడియా సమక్షంలో తిట్టిన అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కాపు సింహం చేశారు. బాధితుడిగా మార్చేశారు.
ప్రత్యర్థులను తిట్టడమే ప్రత్యేకత..
అయితే జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) ఇది కొత్త కాదు. తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిరుదు ఇవ్వడం ఆయనకు అలవాటు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అవమానకర రీతిలో దూషణలు చేసిన వల్లభనేని వంశీని అందగాడితో పోల్చారు. ఇప్పుడు అజ్ఞాతంలో ఉండిపోయేలా చేశారు. ఆయన అనారోగ్యానికి గురయ్యేలా జైలు జీవితానికి కారణం అయ్యారు. వైసీపీలో అందగాళ్ళు, సింహాలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎంతమంది ఈ దారిలోకి వస్తారో చూడాలి. జగన్ రాజకీయం కోసం ఎంతమంది దోషులు నైనా చిత్రీకరించగలరు. ఎంతోమంది నేతలను బాధితులుగా మార్చగలరు. అంబటి రాంబాబు నిన్నటి వరకు టైగర్ గా చెప్పిన జగన్.. ఆయన బెయిల్ పై బయటకు వచ్చాక సింహం గా పేరు మార్చి ప్రజల్లోకి వదులుతారు అన్నమాట.