పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు, రేట్లు, ఆన్ లైన్ టికెటింగ్ పై నిన్న ‘రిపబ్లిక్ మూవీ’ వేడుకలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు.
అయితే పోసాని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. పవన్ వ్యక్తిత్వంపై దాడి చేశాడు. ఆయనను చులకన చేసే ప్రయత్నం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లను ప్రెస్ మీట్ లో పరోక్షంగా ఎత్తి చూపారు. జగన్ ను, ఏపీ మంత్రులను ఆకాశానికెత్తేశాడు.
అయితే పోసాని సినీ ఇండస్ట్రీకి మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారా? లేక వైసీపీకి అనుకూలంగా రాజకీయం చేశాడా? అన్నది సినీ వర్గాల్లో అనుమానాలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్న జగన్ సర్కార్ ను నిలదీస్తే.. పోసాని ఆ సమస్యలపై ఎక్కడా మాట్లాడలేదు. పవన్ ఓడిపోయిన రెండు సీట్ల గురించి.. ఆయన రాజకీయం గురించి.. ఆయన వ్యక్తిగత జీవితంపై దాడికి మాత్రమే పరిమితమయ్యాడు. ఏపీ మంత్రులను మించి ఆడిపోసుకున్నాడు
ఈ క్రమంలోనే పోసాని టాలీవుడ్ కు మద్దతుగా మాట్లాడ లేదని తెలుస్తోంది. ఆయన ఫక్తు వైసీపీ తరుఫున వకాల్తా పుచ్చుకొని జగన్ పై ఈగ వాలనీయకుండా కాపు కాశాడని విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ ఒక క్లియర్ కట్ గా సినీ పరిశ్రమకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాడు. వాటికి సమాధానం ఇవ్వని పోసాని.. జగన్ ను వెనకేసుకొచ్చేలా మాట్లాడడం దుమారం రేపింది. పోసాని సినీ ప్రముఖుడు అన్న విషయాన్ని మరిచిపోయి ఒక వైసీపీ నాయకుడిలా మాట్లాడాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
-పోసాని మాట్లాడిన వీడియో