https://oktelugu.com/

హైదరాబాద్ లోనే సమంత.. చైతన్యకు దూరంగా ఇలా ఎంజాయ్

ఓవైపు హీరో నాగచైతన్య తన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లు, సక్సెస్ మీట్ లతో ఆనందడోలికల్లో ఉన్నారు. ఇటీవలే కొడుకు చైతన్య సినిమా హిట్ పై నాగార్జున డిన్నర్ పార్టీ ఇచ్చాడు. దీనికి లవ్ స్టోరీ మూవీ టీం దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరోయిన్ సాయి పల్లవి, టీం సభ్యులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సైతం హాజరయ్యారు. అయితే హైదరాబాద్ లోనే ఉన్న నాగచైతన్య భార్య సమంత మాత్రం హాజరు కాలేదు. ఎప్పుడూ పార్టీలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2021 / 08:06 PM IST
    Follow us on

    ఓవైపు హీరో నాగచైతన్య తన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లు, సక్సెస్ మీట్ లతో ఆనందడోలికల్లో ఉన్నారు. ఇటీవలే కొడుకు చైతన్య సినిమా హిట్ పై నాగార్జున డిన్నర్ పార్టీ ఇచ్చాడు. దీనికి లవ్ స్టోరీ మూవీ టీం దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరోయిన్ సాయి పల్లవి, టీం సభ్యులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సైతం హాజరయ్యారు. అయితే హైదరాబాద్ లోనే ఉన్న నాగచైతన్య భార్య సమంత మాత్రం హాజరు కాలేదు. ఎప్పుడూ పార్టీలు, పండుగల్లో సందడి చేసే సమంత దీనికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి.

    ‘లవ్ స్టోరీ’ సక్సెస్ సంబరాల్లో సమంత లేకపోవడం చూసి ఆమె ఎక్కడో ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సమంత హైదరాబాద్ లోనే ఉంది. తాజాగా సోమవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వర్షం పడుతుండగా..పారా సైక్లిస్ట్ లతో రైడ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్ తొక్కుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘ప్రతీరోజూ ఈ పారా సైక్లిస్ట్స్ లతో కలిసి సైకిలింగ్ చేయడం నాకు స్ఫూర్తి. వర్షంలో వీరితో కలిసి ఇలా సైకిల్ తొక్కడం.. అదే ఓ చక్కటి తోడు.. తొలిరోజు 21 కి.మీలు తొక్కాను. త్వరలోనే వంద కిలోమీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు.

    ఇటీవలే షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న సమంత తన స్నేహితులు కీర్తి సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్ తో సరదాగా గడిపారు. తన పెంపుడు పిల్లులు హ్యాష్, సాషాల ఫొటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు.

    దీన్ని సమంత ఒంటరిగా ఉంటోందని అర్థమవుతోంది. భర్త నాగచైతన్యతో కలిసి ఉండడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఉంటూ సైక్లింగ్ ఎంజాయ్ చేస్తూ తన పెంపుడు పిల్లులతో ఆడుకుంటూ సేదతీరుతోంది.

    ఇక నాగచైతన్య మాత్రం ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య సమంతను ఇందులో ఇన్ వాల్వ్ చేయడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలన్నవి మరోసారి బయటపడ్డాయి.

    • సమంత సైక్లింగ్ వీడియో