Posani Krishna Murali: పురంధేశ్వరికి ఇచ్చిపడేసిన పోసాని కృష్ణమురళి.. సంచలన ఆరోపణలు

మరోసారి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల విషయాన్ని పోసాని ప్రస్తావించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి తమ్ముడు బాలకృష్ణ కాపాడింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఆమె నాడు నిజాయితీపరురాలు, దేశభక్తురాలు, ఉత్తమురాలు అంటూ ఎద్దేవా చేశారు.

Written By: Dharma, Updated On : November 7, 2023 6:16 pm

Posani Krishna Murali

Follow us on

Posani Krishna Murali: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని పోసాని కృష్ణ మురళి టార్గెట్ చేశారు. ఇటీవల పురందేశ్వరి జగన్ సర్కార్ అవినీతిపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కేంద్ర పెద్దలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. తాజాగా సీఎం జగన్ తో పాటు విజయ్ సాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు పురందేశ్వరిని టార్గెట్ చేసుకున్నారు. అందులో భాగంగా మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణ మురళి పురందేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ను టార్గెట్ చేశారు.

మరోసారి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల విషయాన్ని పోసాని ప్రస్తావించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి తమ్ముడు బాలకృష్ణ కాపాడింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఆమె నాడు నిజాయితీపరురాలు, దేశభక్తురాలు, ఉత్తమురాలు అంటూ ఎద్దేవా చేశారు. తన తమ్ముడు పిచ్చి, మెంటల్ వాడు అంటూ నలుగురు ఫేమస్ డాక్టర్లతో సర్టిఫికెట్ ఇప్పించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బాలకృష్ణ ఒక గంట కూడా పోలీస్ స్టేషన్లో ఉండలేదు. మంచి ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్లి మందు ఇప్పించారని.. అక్కడ మందు తాగుతూ బాలకృష్ణ కూర్చున్నాడు అంటూ నాటి సంగతులను గుర్తు చేస్తూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ సీటు కోసమే పురందేశ్వరి ఆరాటపడుతున్నారని.. చంద్రబాబు కోసం పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా సునాయాసంగా ఎంపీ అయితే.. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. చంద్రబాబు కేంద్రమంత్రి చేస్తారని ఆశపడుతున్నారని.. అందుకే జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని కేంద్ర మంత్రి పొందాలని చూస్తున్నారని.. అందుకే జగన్ పై విషం చిమ్ముతున్నారని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాస్తారా? అంటూ పురందేశ్వరి పై పోసాని కృష్ణ మురళి రంకెలు వేశారు. నాడు కాంగ్రెస్లో ఉంటూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా ఎన్నో రకాల లాభాలు పొందారని.. ఇప్పుడు ఆయన కుమారుడు పై ఏడుస్తున్నారంటూ పోసాని కృష్ణ మురళి పురందేశ్వరిని ఇచ్చి పడేశారు.