Mobile Software Update: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతోంది. దీంతో కొత్త కొత్త గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మొబైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఒకప్పుడు 2జీ నెట్వర్క్ నుంచి నేడు 5జీ వరకు మారింది. ఇంకా ముందు ముందు మరింత అభివృద్ధి చెందుతుందనడంతో అతిశయోక్తి లేదు. అయితే కొత్త మొబైల్స్ ఏవి వచ్చినా వాటిని వాడినంతసేపు వాటి రక్షణ గురించి ఆలోచించడం ఉత్తమం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్నవారు తమ మొబైల్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్మూత్ గా రన్ అవుతోంది. చాలా మంది అప్డేట్ ఆప్షన్ అడగ్గానే డేటా వేస్ట్ అవుతుందని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ నిర్లక్ష్యానికి ఫలితం ఎలా ఉటుందంటే?
మొబైల్ ఫోన్లకు తరుచూ మీ యాప్స్ అప్డేట్ చేసుకోండి అని గుర్తు చేస్తూ మెసేజ్ వస్తుంటాయి. వీటిని అప్డేట్ చేయడం వల్ల డేటా ఖర్చు అవుతుంది. కానీ ఈ డేటా కోసం చూస్తే ఫోన్ ను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులు వీటికి ఆకర్షితులై వాటిని వెంటనే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు.
అయితే వీటితో బగ్స్, లేదా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆ విషయాన్ని మొబైల్ డివైజ్ లోని యాప్స్ తట్టుకోలేనప్పుడు వెంటనే అప్డేట్ చేయమని అడుగుతుంది. ఒక్కోసారి యాప్స్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్ ను కూడా అప్డేట్ చేయాలని కోరుతుంది. అయినా పట్టించుకోకపోతే మొబైల్ మొత్తానికే పనిచేయకుండా పోతుంది. అందువల్ల అప్డేట్ అనే మెసేజ్ రాగానే వెంటనే డేటా కోసం చూడకుండా చేసుకోండి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్స్ ను యాక్ చేసి డేటా మొత్తం చోరీ చేస్తున్నారు. ఇలాంటి వారి బారిన పడకుండా కొన్ని కంపెనీల మొబైల్స్ ముందే హెచ్చరిస్తాయి. వెంటనే సాప్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలని లేకుంటే ప్రమాదంలో పడుతారని చెబుతాయి. సాధారణంగా సాఫ్ట్ వేర్ లో ఏదైనా లోపం ఏర్పడినా బగ్స్ సమస్యలు క్లియర్ చేయాలని అనుకున్నప్పుడు డివైజ్ లకు ఈ మెసేజ్ ను డెవలపర్లు పంపుతారు. ఇలాంటి మెసేజ్ ను ఎట్టిపరిస్థితుల్లో అవైడ్ చేయకుండా వెంటనే అప్డేట్ చేసుకోవాలి.