రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ బాగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా చేరిపోతుంటారు. ఇక చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీల అధినేతలు ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా లాగేసి మంత్రి పదవులు ఇస్తుంటారు. చంద్రబాబు అయితే సమకాలీన రాజకీయాల్లో నేతలను వాడుకొని వదిలేసినట్టు వేరే ఎవ్వరూ అలా చేయరని మోత్కుపల్లి నర్సింహులు, భూమా అఖిలప్రియ లాంటి వారు ఎందరో ఆడిపోసుకున్నారు..
Also Read: విజయవాడ అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఆ మూడు జిల్లాల వారే…
అయితే ఈ రాజకీయాల్లోనూ జగన్ శైలి విభిన్నం. ఆయన తనతోపాటు ఆది నుంచి ఉన్న వారికి అందలం ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి రాగానే వారికే మొదట పదవులు ఇచ్చారు. వైసీపీ కోసం పాటుపడ్డ కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు ఉన్న విజయ్ చందర్ కు ఇచ్చారు.ఇక తన బాబాయ్, వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ వ్యవహారాలు అప్పగించారు. ఇక సలహాదారులుగా నమ్మిన వారిని నియమించారు. ఎన్నికల్లో ఓడిపోయినా తనకు నమ్మినబంట్లుగా ఉన్నందుకు మోపిదేవి, పిల్లి సుభాష్ లను మంత్రులను చేశారు. ఇప్పుడు రాజ్యసభకు పంపారు.
ఇక ఎన్నికలకు ముందర వైసీపీ తరుఫున బలంగా వాయిస్ వినిపించిన పోసాని కృష్ణ మురళిని జగన్ ఎందుకు పక్కనపెట్టాడు? ఆయనకు పదవి ఎందుకు ఇవ్వలేదు.? అందుకే ఇప్పుడు పోసాని మౌనంగా ఉన్నారా అన్న ప్రశ్నకు తాజాగా ఆయన సమాధానమిచ్చారు.
Also Read: శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారా?
జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోనని పోసాని స్పష్టం చేశారు. తాజాగా ఓ టాప్ చానెల్ తో మాట్లాడిన పోసాని జగన్ సీఎం అయ్యాక నా ఇంటికి సజ్జల సహా వైసీపీ కీలక నేతలను పంపించారని.. ఏ పదవి కావాలో తెలుసుకోవాలని అడిగారని.. కానీ తనకు ఏ పదవి వద్దని.. జగన్ ను సీఎంగా చూడాలని అనిపించిందని.. నెరవేరిందని చెప్పానని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.
ఇలా బయటకు తెలియని ఈ వ్యవహారాన్ని తాజాగా పోసాని బయటపెట్టాడు. జగన్ తన పార్టీ కోసం తనకోసం పాటుపడిన వారికి నమ్మకంగా చూసుకుంటాడనే దానికి ఈ ఉదాహరణ అని అర్థం చేసుకోవచ్చు. పోసానికి పదవిని ఆఫర్ చేసినా ఆయనే తిరస్కరించారని తాజాగా పోసాని మాటలను బట్టి తెలుస్తోంది.