Ponnam Prabhakar, Uttam Kumar: హుజురాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టమ్ నిర్వహించింది. పార్టీ ఓటమిపై రివ్యూ సమావేశంలో నేతల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గా మారింది. పార్టీ ఓటమికి మన నేతలే కారణమనే వాదం ప్రధానంగా వినిపించింది. పొన్నం ప్రభార్ ను ఉత్తమ్ చెప్పుతో కొడతానని ఆగ్రహంతో పేర్కొనడంతో దుమారం మరింత పెరిగింది. దీంతో వారిద్దరి మధ్య రగడ ఎక్కడికో వెళ్లిపోయింది. పార్టీ సమావేశం కాస్త ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదంగా మారిపోయింది.

ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఓటమికి కారణాలేంటని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. అందరిని కలుపుకుని పోవాల్సిన మీరు ఎవరిని లెక్క చేయకుండా పోవడంపై కూడా వివరణ అడిగారు. ఈటల రాజేందర్ కు మద్దతు కలిగేలా వ్యవహరించడం ఆంతర్యం ఏమిటన్నారు. పార్టీలో ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మీకే నష్టం జరుగుతుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశాలకు ప్రజలు బాగానే వచ్చినా ఓట్లు మాత్రం ఎందుకు రాలేదని నిలదీశారు.
కొండా సురేఖ లాంటి బలమైన నాయకురాలు ఉన్నా వెంకట్ కు మొగ్గు చూపడంలో అర్థం ఏమిటన్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాల వెనుక ఉన్న ఆలోచన ఏమిటన్నది తెలియడం లేదు. వీహెచ్, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క లాంటి నేతలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహించి ప్రస్తుతం ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. మొత్తానికి ప్రశ్నల వర్షం కురిసింది. రేవంత్ రెడ్డి తీరుపై బహిరంగంగానే నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెగేసి చెప్పారు. రాష్ర్ట కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందని వాపోయింది. దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. ఓటమికి కారకులపై చర్యలుండాల్సిందేనని చెప్పింది. దీనిపై భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు జరగకూడదని అభిప్రాయ పడింది.
Also Read: కేసీఆర్ కు షాక్ తప్పదు.. రేవంత్ రెడ్డికి ప్రజల మొగ్గు.. సంచలన సర్వే
కాంగ్రెస్ కథ కంచికేనా? ఉనికి కోల్పోతున్న పార్టీ భవితవ్యం ఏమిటి?