Sai Dharam Tej: మళ్లీ ఫామ్​లోకి సాయిధరమ్​ తేజ్​.. ఆ డైరెక్టర్​తో సినిమాకు రెడీ!

Sai Dharam Tej: మెగాస్టార్ మెనల్లుడు సాయి ధరమ్ తేజ్​ ఇటీవలే ఓ బైక్​ యాక్సిడెంట్​లో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్స్​ దగ్గర బైక్​ స్కిడ్​ అయ్యి కింద పడ్డారు సాయిధరమ్​. దీంతో తేజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి.. పెను ప్రమాదం నుంచి తప్పించారు. నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్​.. ఇటీవలే దీపావళి రోజు డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స పొందుతున్నట్లు […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 12:56 pm
Follow us on

Sai Dharam Tej: మెగాస్టార్ మెనల్లుడు సాయి ధరమ్ తేజ్​ ఇటీవలే ఓ బైక్​ యాక్సిడెంట్​లో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్స్​ దగ్గర బైక్​ స్కిడ్​ అయ్యి కింద పడ్డారు సాయిధరమ్​. దీంతో తేజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి.. పెను ప్రమాదం నుంచి తప్పించారు. నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్​.. ఇటీవలే దీపావళి రోజు డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, మెల్లగా కోలుకుంటున్న తరుణంలో మళ్లీ షూటింగ్​ల్లో బజీ అవ్వాలని అనుకున్నాడేమో ఏమో కానీ.. ఓ సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు తేజ్ ఒప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. యాక్సిరెండ్​ తర్వాత తేజ్​ చాలా సన్నబడ్డారట. ఇటీవలే మెగాహీరోస్​తో కలిసి తీసుకున్న ఫొటోలోనూ తేజ్​ అలానే కనిపిస్తున్నారు.

చిరు మేనల్లుడిగా వెండితెరపై అడుగుపెట్టి.. పిల్లా నువ్వులేని జివితం సినిమాతో హిట్​ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన రిపబ్లిక్​ సినిమాకు బాస్కాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. అయితే, కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు. కాగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న  సినిమా షూటింగ్​ జనవరి తొలివారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.