Byrnihat Pollution: మన దేశంలో అత్యంత కాలుష్య ప్రాంతంగా ఢిల్లీ వినతి కెక్కింది. మనదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకరమైన ప్రాంతంగా ఢిల్లీ నగరం చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఢిల్లీ మాత్రమే కాదు, మన దేశంలో మరో నగరం కూడా కాలుష్యంలో హస్తినను మించిపోయింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్యకరమైన ప్రాంతంగా ఆ నగరం చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతాలు అత్యంత కాలుష్యకరమైనవిగా ఇప్పటివరకు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ జాబితాలో అస్సాంలోని బర్నిహాట్ నగరం కూడా చేరడం ఆందోళన కలిగిస్తోంది.. మన దేశ వ్యాప్తంగా మొత్తం 190 నగరాలు, పట్టణాలు పీఎం 10 కాలుష్య సూచి వార్షిక సురక్షిత పరిమితిని అధిగమించడం భయభ్రాంతులకు గురిచేస్తోంది.
పీఎం 2.5 వార్షిక పరిమితి నిర్మించిన నగరాల సంఖ్య అయితే ఏకంగా 1,747 కు చేరుకోవడం విశేషం. పీఎం 10 వాయు నాణ్యత సూచిలో మాత్రం ఢిల్లీ నగరం ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. సెంటర్ ఫర్ రిఫెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా విశ్లేషణలో ఈ వివరాలను వెల్లడించింది. ఢిల్లీ తర్వాత ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా ప్రాంతాలు ఉన్నాయి. మనదేశంలో మొత్తం 44 శాతం నగరాలు కాలుష్యమయంగా మారిపోయాయి. 2020లో కోవిడ్ వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ అయింది. ఆ ఏడాదిని గనుక మినహాయిస్తే.. మిగతా సంవత్సరాలు మొత్తం కాలుష్యం ఇదే స్థాయిలో పెరిగిపోతోంది.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అనే పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ.. దేశవ్యాప్తంగా నాలుగు శాతం నగరాలు మాత్రమే ఈ స్కీం కింద కవర్ అయ్యాయి. ఇక అత్యంత ప్రభావిత ప్రాంతాలలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్రం 2019లో క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ను తీసుకొచ్చింది. దీని కోసం ఏకంగా 13 వేల కోట్ల వరకు కేటాయించింది. ఈ నిధులలో మూడో వంతు ఖర్చు చేసినప్పటికీ ఇంతవరకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ స్కీం కింద నగరాలు, పట్టణాలు మొత్తం కలిపి 130 మాత్రమే కవర్ అవుతున్నాయి. ఇందులో 28 నగరాలలో ఇప్పటికీ సరైన వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను నిర్మించలేదు. పీఎం 10స్థాయిని 40 శాతం వరకు తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇందులో 23 నగరాలు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. మరో 23 నగరాల్లో పీఎం 10 స్థాయిలు 2019 తో పోల్చి చూస్తే మరింత పెరగడం విశేషం.