Cleaning of Yamuna river
Delhi : ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే రాజకీయం మొదలైంది. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. లెఫ్టినెంట్ జనరల్ వద్దే కీలక అధికారాలు ఉంటాయి. అందువల్లే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా.. కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం లెఫ్టినెంట్ గవర్నరే అని జాతీయ నాయకులు తమ అంతర్గత చర్చల్లో అంటుంటారు. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన వారు వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే వీరు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటారు. పైగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అందువల్లే ఢిల్లీలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తద్వారా కీలక ఒప్పందాలు మొత్తం రద్దయిపోయాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు.. కొద్ది నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ఢిల్లీలో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉన్నారు.. ఆయన చేసిన ఒక పని ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలలో సంచలనం కలిగించింది.
యమున నది ప్రక్షాళన మొదలైంది
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వీకే సక్సేనా యమునా నది ప్రక్షాళన జరుగుతున్న ఈయనను పరిశీలించారు. దానికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు..” యమునా నది పూర్వరూపు సంతరించుకోబోతోంది. ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది. వ్యర్ధాలు, ఇతర కలుషితాలను నది నుంచి తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇకపై యమునా నది నీటిని తాగడానికి వినియోగించవచ్చు. స్నానం చేయడానికి ఉపయోగించవచ్చని” వ్యాఖ్యానించారు.. అయితే దీని వెనుక వేరే ఉద్దేశం ఉందని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ఆరోపించారు..” రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించవచ్చు కదా. కానీ రాజకీయాల కోసం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.. ఇండియా ఇలాంటి స్వార్థ రాజకీయాల వల్లే వెనక్కి వెళ్ళిపోతుందని” ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యమునా నదిని హర్యానా ప్రభుత్వం కలుషితం చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రి యమునా నదిలో స్నానం చేశారు. ఆ నీటిని తాగారు కూడా. తద్వారా అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అత్యంత తెలివిగా తిప్పికొట్టారు. సక్సేనా యమునా నది ప్రక్షాళన ప్రముఖంగా ప్రస్తావించగా.. దానిని “ఆప్” నాయకులు ఖండించలేదు. కనీసం విమర్శించలేదు. అయితే ఢిల్లీ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ఫైర్ కావడం విశేషం.