https://oktelugu.com/

TS Politics TRS vs BJP: తెలంగాణ లో రాజకీయాలు బీజేపీ vs టీఆర్ఎస్

TS Politics TRS vs BJP:   ‘పంతం నీదా నాదా సై’ అన్నట్టుగానే తయారయ్యాయి తెలంగాణ రాజకీయాలు.. ఓవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మహేష్ బాబు మూవీ ‘దూకుడు’ఖే దూకుడు నేర్పేలా రెచ్చిపోతున్నారు. వరి కొనుగోలు కేంద్రాలను ఈరోజు సందర్శిస్తూ అడ్డుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉరుముతున్నాడు. ఎంతకూ తగ్గేది లే అన్నట్టుగా టీఆర్ఎస్ సర్కార్ ను ఎండగడుతున్నారు. మరోవైపు హుజూరాబాద్ లో గెలిచిన బీజేపీని ఎలాగైనా సరే ఎదగనీయకుండా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2021 9:26 pm
    Follow us on

    TS Politics TRS vs BJP:   ‘పంతం నీదా నాదా సై’ అన్నట్టుగానే తయారయ్యాయి తెలంగాణ రాజకీయాలు.. ఓవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మహేష్ బాబు మూవీ ‘దూకుడు’ఖే దూకుడు నేర్పేలా రెచ్చిపోతున్నారు. వరి కొనుగోలు కేంద్రాలను ఈరోజు సందర్శిస్తూ అడ్డుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉరుముతున్నాడు. ఎంతకూ తగ్గేది లే అన్నట్టుగా టీఆర్ఎస్ సర్కార్ ను ఎండగడుతున్నారు. మరోవైపు హుజూరాబాద్ లో గెలిచిన బీజేపీని ఎలాగైనా సరే ఎదగనీయకుండా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామధాన బేధ దండోపాయాలు రచిస్తున్నారు. ఈ ఇద్దరి ఫైట్ కారణంగా తెలంగాణలో రాజకీయాలు యమ రంజుగా మారాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్నాయి.

    bjp-trs

    bjp-trs

    తగ్గేదే లే అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా వరి రాజకీయాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. వరి కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ మంత్రులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం.. వరి కొనడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేసి తెలంగాణ రైతుల్లో సానుభూతిని పొందడం చేసింది టీఆర్ఎస్. ఇక పాపం మాది కాదు టీఆర్ఎస్ దేనంటూ బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు పోటాపోటీ ధర్నాలు నిర్వహించారు. ఈ రెండు పార్టీల రాజకీయంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.

    ఇక ఈటల రాజేందర్ ను బేస్ చేసుకొని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఈటల రాజేందర్ సన్నిహితులు, టీఆర్ఎస్ లోని అసంతృప్తులు, అసమ్మతులను అందరినీ బీజేపీలోకి లాగడానికి భారీ స్కెచ్ వేసింది. ఈటలకు తోడుగా దాదాపు 20 మంది వరకూ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. వీరంతా 2023 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా బీజేపీలోకి వస్తారని సమాచారం. ఈ గురుతర బాధ్యతను ఈటలతోపాటు జితేందర్ రెడ్డిపై బీజేపీ అధిష్టానం పెట్టినట్టు సమాచారం.

    ఈ క్రమంలోనే అలెర్ట్ అయిన కేసీఆర్.. ఎమ్మెల్సీ తోపాటు నామినేటెడ్ ఇతర పదవులతో టీఆర్ఎస్ అసంతృప్తులను చల్లబరిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిన కడియం శ్రీహరి, జోగురామన్న , తుమ్మల నాగేశ్వరరావు సహా చాలా మంది సీనియర్లకు కేసీఆర్ పదవులు ఇవ్వక అపాయింట్ కూడా ఇవ్వకుండా పక్కనపెట్టాడు. సో వారంతా ఈటల వెంట బీజేపీలోకి వెళ్లే చాన్స్ ఉంది. అందుకే వారందరికీ తిరిగి పదవులు కేటాయించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

    ఈ క్రమంలోనే ఎన్నడూ లేనంతగా అధికార టీఆర్ఎస్ పైనే ఆపరేషన్ ఆకర్స్ తో అసంతృప్తులను ఆకర్షించేందుకు బీజేపీ భారీ ప్లాన్లు వేస్తోంది. అంతే ధీటుగా బీజేపీని తెలంగాణ ప్రజల్లో విలన్లు చేయడానికి బీజేపీ వ్యతిరేక నిర్ణయాలతో టీఆర్ఎస్ రోడ్డెక్కుతోంది. ఆ పార్టీని విశ్వసనీయతను దెబ్బతీస్తే ఆ పార్టీలో ఎవరూ చేరరని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీపై నమ్మకం సడలేలా.. ప్రజల్లో పాపులారిటీ పడిపోయేలా టీఆర్ఎస్ స్కెచ్ గీసింది. ఈ ఇద్దరి వ్యూహా ప్రతివ్యూహాలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్నాయి.