https://oktelugu.com/

Jabardasth Rohini: సర్జరీ చేయించుకోడానికి డబ్బులు సరిపోక జబర్దస్త్ కమెడియన్ రోహిణి పడుతున్న కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు

బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొని ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది.ప్రస్తుతం ఈమె జబర్దస్త్ షో లో ఒక కమెడియన్ గా కొనసాగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 15, 2023 / 01:05 PM IST

    Jabardasth Rohini

    Follow us on

    Jabardasth Rohini: నెల్లూరు యాసతో డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ లో ఒకరు రోహిణి. లేడీ కమెడియన్ గా ఈమెకి బుల్లితెర మీద ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఈ సీరియల్ గ్రాండ్ హిట్ అవ్వడం తో ఈమెకి బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా అవకాశాలు వచ్చాయి.

    బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొని ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది.ప్రస్తుతం ఈమె జబర్దస్త్ షో లో ఒక కమెడియన్ గా కొనసాగుతుంది.ఇది ఇలా ఉండగా హాస్యాన్ని పండించే ఆర్టిస్టు వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో కష్టాన్ని అనుభవిస్తే కానీ వినోదం ని పంచలేరు అని పెద్దలు చెప్తూ ఉంటారు.

    అలా రోహిణి హాస్యం వెనుక కూడా ఎంతో కష్టం ఉంది, బాధ ఉంది. రీసెంట్ గా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో 2016 వ సంవత్సరం లో తాను ఎదురుకున్న కష్టాల గురించి చెప్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘ 2016 వ సంవత్సరం లో నేను ఒక యాక్సిడెంట్ కి గురయ్యాను.ఆ సమయం లో నా కాళ్లకు ఒక రాడ్ పెట్టారు. ఇండస్ట్రీ లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయం అది. ఆర్థికంగా కూడా పెద్ద స్థాయిలో లేను. అయితే ఆ సమయం లో నేను షూటింగ్ చేసేటప్పుడు, డ్యాన్స్ వేసేటప్పుడు చాలా నొప్పి కలిగేది.రాడ్ పెట్టిన చోట ఎముక పెరిగిన తర్వాత, ఆ రాడ్ ని తీసివెయ్యాల్సిందిగా నేను డాక్టర్లను కోరాను. కానీ ఆ ఎముక చాలా సున్నితమైనది అని, రాడ్ ని తొలగిస్తే ప్రమాదం అని చెప్పారు. ఇక చేసేది ఏమి లేక , ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.