Modi vs Kcr: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ కు వస్తున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం కర్ణాటకకు వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు మోడీ ముఖం చూడడానికే కేసీఆర్ ఇష్టపడడం లేదంటే అతిశయోక్తి కాదు.. మోడీపై అంత పగ, ప్రతీకారాలతో కేసీఆర్ ఎందుకు రగిలిపోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చి మే 29వరకూ జాతీయ స్థాయిలో పర్యటిస్తాడనుకున్న కేసీఆర్ సడెన్ గా సిటీ వదిలేసి వెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఇప్పుడు అత్యవసరం కానీ రాజకీయ మీటింగ్ ల కోసం వెళుతున్నారు. జేడీఎస్ నేతలైన దేవేగౌడ, కుమారస్వామిలతో కేసీఆర్ భేటికి బెంగళూరు వెళ్లారు. దేశంలో ప్రత్యామ్మాయ రాజకీయంపై వారితో చర్చలు జరుపనున్నారు.
Also Read: Konaseema Tension: అమలాపురం విధ్వంసం వెనుక ఎన్నో అనుమానాలు.. వారి పనేనా?
ఇప్పటికే ఓ సారి కర్ణాటక వెళ్లి మరీ వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇప్పుడు మరోసారి వెళుతున్నారు. కేసీఆర్ వెళుతున్న టైమింగ్ పైనే చాలా చర్చలు జరుగుతున్నాయి.
నిజానికి దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎంత పెద్ద వైరుధ్యాలు ఉన్నా కూడా ఆయనకు స్వయంగా సీఎం స్వాగతం పలకాలి. అది ప్రోటోకాల్ గా ఆది నుంచి వస్తోంది. మోడీతోపాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ కేసీఆర్ మాత్రం ఇటీవల బీజేపీ విధానాలను తూర్పారపడుతూ మోడీని విలన్ గా అభివర్ణిస్తున్నారు. ఆయనతోపాటు వేదిక పంచుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. కనీసం ఎదురు కూడా పడడం లేదు. అందుకే ఇప్పుడు మోడీ వస్తున్నా కూడా ఆయనకు ముఖం చూపించలేక.. ప్రోటోకాల్ అధిగమించలేక ఏకంగా సిటీలోనే లేకుండా పక్కరాష్ట్రం వెళ్లిపోతున్నారు.
మోడీ వస్తుండగా.. అక్కరకు రాని.. ఇప్పుడు అవసరం లేని దేవెగౌడ, కుమారస్వామిలతో భేటి కోసం ప్రధాని పర్యటనను పక్కనపెట్టి వెళ్లడమే కేసీఆర్ పై విమర్శలకు కారణం అవుతోంది. మోడీకి ఎదురుపడకూడదనే కేసీఆర్ ఇలా స్కిప్ చేయడం దుమారం రేపుతోంది.
కేసీఆర్, మోడీ మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్మాయంగా దేశంలో ఒక ప్రబల కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు. మోడీతో భేటికి కేసీఆర్ వెళ్లినా అపాయింట్ మెంట్ దొరకలేదు. తెలంగాణ అధికారులను కేంద్రంలోని అధికారులు కలవడం లేదు. దీంతో మోడీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్.. రాష్ట్రానికి ప్రధాని వస్తున్నా కలవడానికి ఇష్టపడడం లేదని టాక్. మోడీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడకపోవడానికి అసలు కారణాలు ఇవేనని విశ్లేషకులు అంటున్నారు.
Also Read:Minister Puvvada Ajay Kumar: జగన్ ను దారుణంగా అవమానించిన తెలంగాణ మంత్రి