రాజకీయ చదరంగం.. ఈ విమర్శలు ఖాయం

రాజకీయాలంటే అన్ని అంశాలుంటాయి. పొగడ్తలు, ట్విస్టులు, విశేషాలు కలిసి ఉంటాయి. ఒక నాయకుడు ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీకి వెళితే ఆయన మాటలకు చేతలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అన్ని బయటకు వస్తాయి. వాటిని జనం పట్టించుకోరు. పాత పార్టీ నాయకులు అభ్యంతరం పెట్టరు.రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఊరుకుంటారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీని తిట్టిన వీడియోలు టీఆర్ఎస్ నాయకులు […]

Written By: Srinivas, Updated On : June 5, 2021 5:33 pm
Follow us on

రాజకీయాలంటే అన్ని అంశాలుంటాయి. పొగడ్తలు, ట్విస్టులు, విశేషాలు కలిసి ఉంటాయి. ఒక నాయకుడు ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీకి వెళితే ఆయన మాటలకు చేతలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అన్ని బయటకు వస్తాయి. వాటిని జనం పట్టించుకోరు. పాత పార్టీ నాయకులు అభ్యంతరం పెట్టరు.రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఊరుకుంటారు.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీని తిట్టిన వీడియోలు టీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. ఈటల టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్,ఇతర నేతలను పొగుడుతూ మాట్లాడిన మాటలను సైతం విడుదల చేశారు. గులాబీ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని తిట్టిన ఈటలను బీజేపీలో చేర్చుకోమని చెబుతారా? అదంతా కామన్ అనుకుంటారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్నప్పుడు సమైక్యాంధ్రను పొగుడుతూ కేసీఆర్ ను తిట్టిన ఆయన టీఆర్ఎస్ లో చేరాక చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. రోజా టీడీపీలో ఉండగా అందరిని వీరలెవల్లో బూతులు తిట్టారు. చంద్రబాబు టీడీపీలో ఉన్నఒకే ఒక్క మగాడు రోజా అని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె చంద్రబాబును తూర్పారపడుతున్నారు. టీడీపీలో ఉండగా రెచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తమకు నచ్చని వారిని తిట్టడం, నచ్చిన వారిని పొగడడం నాయకుల నైజం. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ప్రతిపక్షాలను తిడితేనే అధినేత దృష్టిలో పడతామని నాయకులు భావిస్తుంటారు. ఇందులో భాగంగా ఎదుటి వారిని బండబూతులు తిడుతూ వార్తల్లో వైరల్ అవుతుంటారు. అలా తిడితేనే యాక్టివ్ గా ఉన్నట్లు తెక్క. జనాల్లో చర్చలు జరుగుతాయి. అలాంటి వాళ్లకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.